టిక్కుటాక్కు Dress.. కళ్లకు గాగుల్స్‌, కాళ్లకు Shoe, చేతిలో Laptop.. ఎవరీ వ్యక్తి.. సోషల్ మీడియాలో వైరల్..

ABN , First Publish Date - 2021-11-15T18:48:18+05:30 IST

టిక్కుటాక్కు Dress.. కళ్లకు గాగుల్స్‌, కాళ్లకు Shoe, చేతిలో Laptop.. ఎవరీ వ్యక్తి.. సోషల్ మీడియాలో వైరల్..

టిక్కుటాక్కు Dress.. కళ్లకు గాగుల్స్‌, కాళ్లకు Shoe, చేతిలో Laptop.. ఎవరీ వ్యక్తి.. సోషల్ మీడియాలో వైరల్..

  • ఎవరా వ్యక్తి.. ?
  • అలకాపూర్‌ చోరీపై సోషల్‌ మీడియాలో వైరల్‌

హైదరాబాద్ సిటీ/నార్సింగ్‌ : టిక్కుటాక్కు డ్రస్సు.. కళ్లకు గాగుల్స్‌, కాళ్లకు షూ, చేతిలో ల్యాప్‌టాప్‌ బ్యాగ్‌ పట్టుకుని తిరుగుతున్న ఓ వ్యక్తి ఫొటో వీడియో మణికొండ మున్సిపాలిటీలోని దాదాపు 20 కాలనీల్లో వాట్సప్‌ గ్రూపులు, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఎవరా వ్యక్తి అని పరిశీలిస్తే దొంగగా అనుమానిస్తున్నారు. శుక్రవారం రాత్రి అలకాపూర్‌ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రెండు ఫ్లాట్లలో ఘరానా చోరీ జరిగింది. ఈ చోరీ విషయంలో స్థానికంగా పలు అపార్ట్‌మెంట్ల సీసీ కెమెరాలు పరిశీలించగా ఈ టిక్కుటాక్కు మనిషి కొత్త వ్యక్తిగా గుర్తించారు. నేరం చేసింది ఇతనా కాదా అనే విషయంపై నార్సింగ్‌ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అలకాపూర్‌లో జరిగిన చోరీతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇంకోపక్క ఈ చోరీ స్థానికంగా హల్‌చల్‌ చేసింది. పోలీసుల విచారణ తేలితే తప్ప అసలు దొంగ ఎవరో తెలుస్తుంది. 

Updated Date - 2021-11-15T18:48:18+05:30 IST