Oct 19 2021 @ 01:02AM

సైకో ఎవరు?

సునీల్‌, ధన్‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బుజ్జీ ఇలా రా’. ‘సైకలాజికల్‌ థ్రిల్లర్‌’ అనేది ట్యాగ్‌లైన్‌. చాందిని అయ్యంగార్‌ హీరోయిన్‌. ‘గరుడవేగ’ అంజి దర్శకుడు. ఇటీవల ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు అగహ్రారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి మాట్లాడుతూ ‘‘ఈ సినిమాకు అన్నీ మా అన్న జీ నాగేశ్వరరెడ్డి గారే. అంజి సినిమాను అద్భుతంగా తీశారు’’ అని చెప్పారు. ధన్‌రాజ్‌ మాట్లాడుతూ ‘‘45 రోజుల్లో సినిమాను పూర్తి చేశాం. సీఐ కేశవ్‌నాయుడి పాత్రను పోషించారు. ఇందులో కొత్త ధన్‌రాజ్‌ను చూస్తారు’’ అని అన్నారు. కథా రచయిత జి. నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ‘‘ధన్‌రాజ్‌లో కమెడియన్‌తో పాటు ఓ సైకో ఉన్నాడు. అందుకే ఈ సినిమాను ఆయనతో చేస్తున్నాం. ఈ చిత్రంతో ఆయన నటుడిగా మరో మెట్టు ఎక్కుతాడు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం:సాయికార్తిక్‌.