Abn logo
Jun 2 2020 @ 21:40PM

‘సర్కారు వారి పాట’ హీరోయిన్ ఆమేనా?

సూపర్ స్టార్ మహేష్ బాబు, ‘గీతగోవిందం’ దర్శకుడు పరశురామ్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకోబోతోన్న చిత్రానికి సంబంధించి టైటిల్, ప్రీలుక్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘సర్కారు వారి పాట’ అనే టైటిల్‌తో పాటు మహేష్ లాంగ్ హెయిర్, లైట్ బియర్డ్‌తో స్టైలిష్‌గా మెడ మీద వన్ రూపీ కాయిన్ టాటూతో ఇయర్ రింగ్ పెట్టుకుని ముందెప్పుడూ చూడని మాస్ లుక్‌తో ఉన్న ప్రీలుక్‌ను విడుదల చేశారు. మహేష్ ఇచ్చిన ఈ డబుల్ ట్రీట్‌ను ఫ్యాన్స్ యమా ఎంజాయ్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు మూవీని నిర్మిస్తున్నాయి. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఎవరా? అంటూ చర్చలు మొదలయ్యాయి.


ఈ సినిమాలోని హీరోయిన్ పాత్ర విషయంలో ఇప్పటికే ఇద్దరు ముగ్గురు పేర్లు వినిపించాయి. కానీ మేకర్స్ మాత్రం ఎవరి పేరు ప్రకటించలేదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మహేష్ బాబు సరసన నటించేందుకు ‘భరత్ అనే నేను’ ఫేమ్ కియారా అద్వానీని మేకర్స్ సంప్రదించారట. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న కియారా ముందు ‘డేట్స్ అడ్జస్ట్ చేయలేను’ అని చెప్పినప్పటికీ.. ఈ కరోనా గ్యాప్‌తో కాస్త డేట్స్ అటు ఇటు అయ్యే అవకాశం ఉండటంతో.. పరిస్థితులను చూసుకుని చెబుతానని చెప్పినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే టాలీవుడ్‌లో తనకి బంపర్ హిట్ ఇచ్చిన మహేష్ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదని కియారా కూడా భావిస్తుందట. అందుకే మేకర్స్ హీరోయిన్ విషయంలో ఇంకా ఎవరినీ ఫైనల్ చేయలేదు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే వరకు హీరోయిన్ గురించి ఎటువంటి సమాచారం మేకర్స్ ఇవ్వకపోవచ్చు. ఒక్కసారి కియారా డేట్స్ అడ్జస్ట్ చేయగానే అఫీషియల్‌గా ఆమె పేరును చిత్రయూనిట్ ప్రకటించనుందని అనుకుంటున్నారు. 

Advertisement
Advertisement
Advertisement