ఆమె ప్రియుడు ఎవరు?

సుప్రసిద్ధ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అతడే ఆమె ప్రియుడు’. సునీల్‌, కౌశల్‌ ప్రధాన పాత్రధారులు. రవి కనగాల, రామ్‌ తుమ్మలపల్లి నిర్మాతలు. ఇటీవల టీజర్‌ విడుదల చేశారు. ‘‘నవలా రచయితగా యండమూరి అద్భుతాలు సృష్టించారు. ఆయన నవలలు కొన్ని సినిమాలుగా వచ్చి, విజయవంతమయ్యాయి. ‘అతడే ఆమె ప్రియుడు’ కూడా ఆ జాబితాలో చేరుతుందన్న నమ్మకం ఉంది. అనుక్షణం ఉత్కంఠభరితంగా సాగే ఈ చిత్రంలో సునీల్‌, బిగ్‌ బాస్‌ ఫేమ్‌ కౌశల్‌ పాత్రలు వైవిధ్యంగా ఉంటాయి. టీజర్‌కి మంచి స్పందన వస్తోంద’’న్నారు నిర్మాతలు. 


Advertisement