తెలంగాణలో YS Sharmila వెనకుండి ధైర్యమిస్తోంది అతడేనా..!?

ABN , First Publish Date - 2021-07-27T03:20:20+05:30 IST

తెలంగాణలో వైఎస్ షర్మిలను ముందుకు నడువాలని వెనుకుండి ధైర్యమిస్తోంది అతనేనా?..

తెలంగాణలో YS Sharmila వెనకుండి ధైర్యమిస్తోంది అతడేనా..!?

తెలంగాణలో వైఎస్ షర్మిలను ముందుకు నడువాలని వెనుకుండి ధైర్యమిస్తోంది అతనేనా? జనం నాడి తెలుసుకునేందుకు ఆయన మనుషులు పని మొదలుపెట్టారా? దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న ఆ వ్యక్తి.. మున్ముందు నేరుగా షర్మిలకు సలహాలు, సూచనలు ఇస్తారా? ఇప్పటికైతే ఆయన మనుషులు ఇన్‌డైరెక్ట్‌గా షర్మిల టీమ్‌కు ఇన్‌పుట్స్‌ ఇస్తున్నారా? అనే విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం.


షర్మిల పంచ్‌ల వర్షం..!

తెలంగాణలో పార్టీ పెట్టిన వైఎస్‌ షర్మిల అటు అధికార పార్టీపై, ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీపై, బీజేపీపై  ఏకకాలంలో విమర్శల వాగ్బాణాలు సందిస్తున్నారు. పలు సమస్యలపై  పంచ్‌లు వేస్తున్న షర్మిల.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను, టీపీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డిని, బీజేపీ హైకమాండ్‌ను  తన విమర్శలకు ప్రతివిమర్శలు చేసేలా స్పందించాలని మంట పుట్టించే ప్రయత్నం చేస్తున్నారు.తెలంగాణలో ప్రతీ సమస్యకు మూలం మూడు పార్టీలన్నట్లు అటు  అధికార, ఇటు ప్రతిపక్షాల అటెన్షన్‌ తనవైపు తిప్పుకునేలా ప్రసంగాల వాడివేడి పెంచుతున్నారు వైఎస్‌ తనయ.


వ్యూహకర్త ఆమేనా..!?

షర్మిల వ్యూహాత్మక వైఖరివెనుక తమిళనాడుకు చెందిన ఓ టీమ్‌ పనిచేస్తుందనే టాక్‌ పొలిటికల్‌ సర్కిల్‌లో వినిపిస్తోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రియ.. వైఎస్‌ కూతురు షర్మిలకు తెలంగాణలోని రాజకీయ పరిస్థితులు, వాటిపై స్పందించాల్సిన తీరుకు సంబంధించి రాజకీయ వ్యూహాలు విడమర్చి చెబుతోందని  గుసగుసలు వినిపిస్తున్నాయి. తమిళనాడు తిరువల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే రాజేంద్రన్ కూతురు ప్రియదర్శిని రాజేంద్రన్ ఎన్నికల స్ట్రాటజిస్ట్‌గా సేవలందిస్తోంది. డీఎంకే కోసం ప్రశాంత్‌ కిషోర్‌కు తన సర్వే సంస్థ ఎన్‌పీసీ ద్వారా ప్రియ కలిసి పనిచేశారు.


డైరెక్టుగా పీకే రావడం కరెక్ట్ కాదని..!

షర్మిల కోసం పనిచేస్తున్న ప్రియ తరుచూ ఢిల్లీ వెళ్లి ప్రశాంత్‌ కిషోర్‌తో భేటీ కావడం వైఎస్సార్‌టీపీలో, తెలంగాణలో చర్చకు దారితీస్తోంది. పీకే శిష్యురాలిగా ప్రియ పేరు తరుచుగా వినిపిస్తోంది. షర్మిల పార్టీ కోసం ఇప్పుడే నేరుగా ప్రశాంత్ కిషోర్ రావడం కరెక్ట్ కాదని... ఆయన శిష్యురాలు ప్రియాను పంపించారన్న చర్చ బలంగా సాగుతోంది. పార్టీలో వైఎస్ షర్మిలకు తప్పా.. రెండో వ్యక్తికి తెలియకుండానే తెలంగాణలో ఇప్పటికే రెండు సార్లు ప్రియా టీం సర్వేలు చేసింది. కొత్త పార్టీ పై ప్రజల స్పందన... వైఎస్సార్ పేరు జనాలు ఇంకా గుర్తుపెట్టుకున్నారా...? మరిచిపోయారా...? ఆ నియోజకవర్గంలో గెలుపుగుర్రాలు ఎవరు..? అనే అంశంలో సీక్రెట్ రిపోర్ట్ షర్మిలకు అందజేసింది వ్యూహకర్త ప్రియ.


షర్మిలతో మాత్రమే..!

టీమ్‌తో వర్క్‌ చేయించిన ప్రియ నేరుగా తెలంగాణకు రావడం లేదు. వైఎస్సార్‌టీపీలో ఎవరినీ కలువని ప్రియ కేవలం షర్మిలతోనే మాట్లాడుతోందట. ఆ తర్వాత ఢీల్లీ వెళ్లి పీకేను కలిసి ఇక్కడి ఇన్‌పుట్స్ అక్కడి డిస్కషన్‌ చేస్తోందట. ఆయనిచ్చే సలహాలు, సూచనలు ఇక్కడ అప్లై చేస్తుందనే టాక్‌ వైసీఆర్‌టీపీలో వినిపిస్తోంది. ఎన్నికల సమయం వరకు ఈ విషయంలో పీకే పూర్తిస్థాయి వ్యూహకర్తగా పనిచేస్తారా? లేదా శిష్యురాలికి తెలంగాణను ఓ ప్రయోగశాలగా అప్పగిస్తారా అనే చర్చ నడుస్తోంది.



Updated Date - 2021-07-27T03:20:20+05:30 IST