బుబోనిక్ ప్లేగును ప్రమాదకరమైనదిగా పరిగణించడం లేదు: డబ్ల్యూహెచ్ఓ

ABN , First Publish Date - 2020-07-08T01:10:35+05:30 IST

చైనాలో రోజుకో మహమ్మారి పుట్టుకొస్తున్న విషయం కొత్తగా చెప్పనవసరం లేదు. మొన్న కరోనా.. నిన్న జీ4 వైరస్‌లు పుట్టుకురాగా.. తాజాగా ‘బుబోనిక్ ప్లే

బుబోనిక్ ప్లేగును ప్రమాదకరమైనదిగా పరిగణించడం లేదు: డబ్ల్యూహెచ్ఓ

జెనీవా: చైనాలో రోజుకో మహమ్మారి పుట్టుకొస్తున్న విషయాన్ని కొత్తగా చెప్పనవసరం లేదు. మొన్న కరోనా.. నిన్న జీ4 వైరస్‌లు పుట్టుకురాగా.. తాజాగా ‘బుబోనిక్ ప్లేగు’ మహమ్మారి వెలుగులోకి వచ్చింది. అయితే బుబోనిక్ ప్లేగును అత్యంత ప్రమాదకరమైన మహమ్మారిగా పరిగిణించడం లేదంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తాజాగా ప్రకటించింది. బుబోనిక్ ప్లేగును సమర్థవంతంగా అదుపులోకి తీసుకొచ్చినట్టు మంగళవారం డబ్ల్యూహెచ్ఓ అధికారి మార్గరెట్ హ్యారిస్ తెలిపారు. చైనా, మంగోలియా ప్రభుత్వాలతో కలిసి చైనాలో విజృంభిస్తున్న వైరస్‌లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు మార్గరెట్ పేర్కొన్నారు. బుబోనిక్ ప్లేగు మహమ్మారిపై కూడా ఫోకస్ పెట్టామని.. అయితే ప్రస్తుతానికి మాత్రం దీన్ని ప్రమాదకరమైనదిగా పరిగణించడం లేదన్నారు. కాగా.. ఇటీవల ఇన్నర్ మంగోలియాలోని బైయన్నూరు ప్రాంతంలో ఇద్దరికి ఈ వ్యాధి సోకింది. ఈ కారణంగా బైయన్నూరు ప్రాంతంలో లెవల్-3 హెచ్చరికను జారీ చేయాల్సి వచ్చింది. కరోనా మహమ్మారి లాగానే ఈ వ్యాధి సోకడానికి కూడా ఓ జంతువే కారణమని తెలుస్తోంది. ముర్మోట్ అనే ఉడుత జాతికి చెందిన జంతువు మాంసం తిన్నవారికి ఈ వ్యాధి సోకినట్టు వైద్యులు గుర్తించారు.

Updated Date - 2020-07-08T01:10:35+05:30 IST