వాటితో పోలిస్తే కోవిడ్ అంత ప్రమాదకరం కాదు: డబ్ల్యూహెచ్‌వో

ABN , First Publish Date - 2020-02-19T14:39:50+05:30 IST

ప్రపంచ దేశాలకు ముచ్చెమటలు పట్టిస్తున్న కోవిడ్-19 వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

వాటితో పోలిస్తే కోవిడ్ అంత ప్రమాదకరం కాదు: డబ్ల్యూహెచ్‌వో

జెనీవా: ప్రపంచ దేశాలకు ముచ్చెమటలు పట్టిస్తున్న కోవిడ్-19 వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గతంలో చైనాను అల్లాడించిన సార్స్(ఎస్‌ఏఆర్‌ఎస్), సౌదీ అరేబియాను వణికించిన మెర్స్(ఎమ్‌ఈఆర్‌ఎస్) వైరస్‌లతో పోల్చుకుంటే కోవిడ్ అంత ప్రమాదకరమైంది కాదని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానోమ్ అభిప్రాయపడ్డారు. ఇక్కడ విశేషమేంటంటే.. సార్స్, మెర్స్, కోవిడ్ మూడూ కరోనా కుటుంబానికి చెందిన వైరస్‌లే. వీటి గురించి మాట్లాడిన టెడ్రోస్.. ‘ప్రస్తుతం శాస్త్రవేత్తలకు కోవిడ్‌పై దాదాపు ఓ అవగాహన వచ్చేసినట్లే. అదీగాక ఈ వైరస్ సోకిన 80శాతం రోగుల్లో వ్యాధి లక్షణాలు అంత తీవ్రంగా ఏమీ లేవు’ అని పేర్కొన్నారు. కాగా, కోవిడ్-19 వైరస్ కారణంగా చైనాలో ఇప్పటికే దాదాపు 1900 మంది మృతిచెందారు.

Updated Date - 2020-02-19T14:39:50+05:30 IST