Advertisement
Advertisement
Abn logo
Advertisement

వీరింతే..!

- రిజిస్ట్రేషన్‌ అధికారుల నిర్లక్ష్యం 

- సమయానికి తెరుచుకోని కార్యాలయం

- సమయపాలన పాటించని సిబ్బంది

- రిజిస్ట్రేషన్‌ల కోసం దరఖాస్తుదారుల పడిగాపులు అచ్చంపేటటౌన్‌, డిసెంబరు 4: అచ్చంపేట నియోజ కవర్గంలోని మండల, గ్రామీణ ప్రాంతాల ప్రజలు ని త్యం తమ తమ అవసరాల కోసం పట్టణంలోని సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వస్తుంటారు. సమయపా లన పాటించకుండా కార్యాలయ అధికారులు, సిబ్బంది తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కార్యాల యాన్ని తెరవకపోవడంతో పడిగాపులు కాయాల్సి వ స్తున్నదని ప్రజలు వాపోయారు. ‘ఆంధ్రజ్యోతి’  శనివా రం రిజిస్ట్రేషన్‌ కార్యాలయాన్ని విజిట్‌ చేయగా 11గంట లైనా తెరుచుకోలేదు. ఇన్‌చార్జి సబ్‌రిజిస్ట్రార్‌ గత 20 రోజుల నుంచి సెలవులో ఉన్నారు. దీంతో ఉమ్మడి జి ల్లా సబ్‌ రిజిస్ట్రార్‌ పర్యవేక్షిస్తున్నారు.  ఆయన కూడా కార్యాలయానికి రాలేదు. సిబ్బంది కూడా సమయపా లన పాటించకుండా సుదూర ప్రాంతాల  నుంచి వస్తు న్నాం.. అందుకే ఆల స్యం అవుతుందని దాటవేసే స మాధానం చెప్పారు. ఏళ్లు గడిచినా సంబంధిత ఉన్న తాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో నిర్లక్ష్యం తాండ వం చేస్తున్నది. ఉదయం 10గంటలకు తెరుచుకొని సాయంత్రం 5గంటలకు మూసివేయాల్సిన కార్యాల యం రాత్రి 10గంటల వరకు కూడా తమ ఇష్టానుసా రంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారనే ఆరోపణలు  వినిపిస్తు న్నాయి. ఎవరు ముడుపులు చెల్లిస్తే వారి దస్తావేజు లను ముందుంచి వారికి మాత్రమే ప్రాధాన్యం కల్పిస్తు న్నారు. డబ్బులు ఇవ్వనివారివి చివరలో ఉంచి రోజు ల తరబడ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. 

 

దరఖాస్తు రశీదు ఇవ్వాలంటే రూ.100 చెల్లించాల్సిందే

సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చిన వారు పూర్తయిన తరువాత రశీదు ఇవ్వటానికి అందులో పనిచేస్తున్న ఓ వ్యక్తి దరఖాస్తుదారుని నుంచి రూ.100 చెల్లిస్తేనే రశీదు ఇస్తున్నట్లు ఆరోపణ లు వినిపిస్తున్నాయి. కార్యాలయంలో ఏ అధికారి ఉన్నా చూసీచూడనట్లు వ్యవరిస్తున్నారు. అందులో సబ్‌ రిజిస్ట్రార్‌ కూడా భాగం ఉందని తెలుస్తున్నది.

  స్టాంప్‌లు కావాలంటే 40శాతం అధికంగా చెల్లించాల్సిందే

రిజిష్టర్‌ కార్యాలయాల్లో ఎన్నో  కోణాలు చవిచూస్తు న్నటికీ రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటున్నా అచ్చంపేట సబ్‌ రిజిష్టర్‌ కార్యాలయంలో అధికారుల చేతివాటంలో తీరు మారడం లేదు. రూ.100 స్టాంప్‌కు అధికంగా 30నుంచి 40 రూపాయలు చెల్లించాల్సి వస్తు న్నది. ఇదేమి అని ప్రశ్నిస్తే అది అంతే అని నిరక్ష్యంగా సమాధానం చెబుతున్నారు.  అధికారుల బదిలీలు జరిగినప్పటికీ పైరవీలు చేసి స్థానచలనం లేకుండా ఉన్న చోటనే ఉద్యోగాలు చేసే విధంగా చక్క బెట్టుకుంటున్నారు.


Advertisement
Advertisement