ప్రిన్సిపాళ్లు ఎవరు..?

ABN , First Publish Date - 2022-05-18T05:37:01+05:30 IST

ఏపీ మోడల్‌ స్కూల్‌లో విధులు నిర్వహిస్తున్న పీజీటీ, డీజీటీలు, ఎఫ్‌ఏసీ ప్రిన్సిపాళ్లు బదిలీల్లో భాగంగా ఈనెల 13న రిలీవయ్యారు. వారి స్థానంలో బాధ్యతలు చూసే ఇనచార్జి ప్రిన్సిపాళ్లు ఎవరనే విషయంపై స్పష్టత లేదు.

ప్రిన్సిపాళ్లు ఎవరు..?

  1.  రిలీవైన ఎఫ్‌ఏసీ  ప్రిన్సిపాళ్లు 
  2.  ఇంకా తేలని సీనియారిటీ వివరాలు 

ఆలూరు, మే 17:  ఏపీ మోడల్‌ స్కూల్‌లో విధులు నిర్వహిస్తున్న పీజీటీ, డీజీటీలు, ఎఫ్‌ఏసీ ప్రిన్సిపాళ్లు బదిలీల్లో భాగంగా ఈనెల 13న రిలీవయ్యారు. వారి స్థానంలో బాధ్యతలు చూసే ఇనచార్జి ప్రిన్సిపాళ్లు ఎవరనే విషయంపై స్పష్టత లేదు. సెలవులు రావడంతో కొన్ని మోడల్‌ స్కూళ్లు మూతపడ్డాయి. ఇంటర్‌ పరీక్షల సెంటర్లు ఉన్న చోట మాత్రమే పాత ప్రిన్సిపాళ్లు ఇంకా కొనసా గుతూ తాత్కాలికంగా అక్కడున్న డీజీటీ ఉపాధ్యా యులకు ఇనచార్జి బాధ్యతలు అప్పజెప్పారు. వారు కూడా పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకోకుండా అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తుండడంతో మోడల్‌ స్కూళ్ల సిబ్బంది అయోమయంలో ఉన్నారు. 

తేలని సీనియారిటీ  లెక్క : కర్నూలు, నంద్యాల ఉమ్మడి జిల్లాలో మొత్తం 36 ఏపీ మోడల్‌ స్కూళ్లు ఉన్నాయి. రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ ఆదేశాల మేరకు ఈనెల 13న 90 శాతం మంది ఉపాధ్యాయులు రిలీవయ్యారు. పాత ప్రిన్సిపాళ్లు  కొందరు ఇక్కడే ఉన్నా... మరికొన్ని స్కూళ్లలో ఇనచార్జి బాధ్యతలు ఇవ్వకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. మోడల్‌ స్కూళ్లలో రెగ్యులర్‌ ప్రిన్సిపాళ్లు పది మందికి మించి లేరు. మిగతా స్కూళ్లలో ఎఫ్‌ఏసీలుగా విధులు నిర్వహించారు. వాస్తవంగా స్కూలులో సీనియారిటీ ప్రాతిపదికన ప్రిన్సిపాళ్లు. వైస్‌ ప్రిన్సిపాళ్లు కొనసాగుతారు. ఇంతవరకు సీనియారిటీ లెక్క డీఈవో కార్యాలయానికి కూడా అందలేదు. 

బాధ్యత ఎవరిది : ఎఫ్‌ఏసీ ప్రిన్సిపాళ్లు ఎవరనేది సిబ్బందిలో అయోమయం నెలకొంది. ప్రతిరోజూ విద్యాశాఖ నుంచి మెయిల్స్‌, ఇతర వివరాలు స్కూళ్లకు అనుబంధంగా ఉన్న బాలికల హాస్టల్స్‌ నిర్వహణ, పర్యవేక్షణ ఎవరు చూస్తారో తెలియని పరిస్థితి. స్కూళ్లు, హాస్టళ్లలో పని చేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలకు సంబంధించిన బిల్లులు పెట్టాలన్నా ప్రిన్సిపాళ్ల సంతకం ఎవరు చేస్తారు... ఎవరిని అడగాలో అన్న అయోమయంలో సిబ్బంది ఉన్నారు. 


Updated Date - 2022-05-18T05:37:01+05:30 IST