ఉద్యోగాలు కాదు.. ప్రాణాలు ముఖ్యం

ABN , First Publish Date - 2020-04-05T08:32:25+05:30 IST

‘ఉద్యోగాలు కాదు.. ప్రజల ప్రాణాలు కాపాడటం అతి ముఖ్యం’ అని ప్రపంచ ఆరోగ్యసంస్థ

ఉద్యోగాలు కాదు.. ప్రాణాలు ముఖ్యం

ఐఎంఎఫ్‌, డబ్ల్యూహెచ్‌వో స్పష్టీకరణ

జెనీవా(స్విట్జర్లాండ్‌), ఏప్రిల్‌ 4: ‘ఉద్యోగాలు కాదు.. ప్రజల ప్రాణాలు కాపాడటం అతి ముఖ్యం’ అని ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్‌వో), అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్‌) చెప్పాయి. ప్రజలు, ఆర్థిక వ్యవస్థల ఆరోగ్యాల పరిరక్షణకు తమవంతు కృషిచేస్తామని స్పష్టం చేశాయి. డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ఘెబ్రెయెసూస్‌, ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టలీనా జార్జివాలు బ్రిటన్‌ వార్తాపత్రిక ‘ది డైలీ టెలిగ్రా్‌ఫ’ కు రాసిన సంయుక్త కథనంలో ఈ మేరకు తమ అభిప్రాయాల్ని వ్యక్తపరిచారు. కరోనా సంక్షోభాన్ని ఎదురీదేందుకు 85 దేశాలు ఐఎంఎఫ్‌ అత్యవసర సాయం కోసం విజ్ఞప్తి చేశాయని క్రిస్టలీనా జార్జివా తెలిపారు. ఆయా దేశాలకు అండగా నిలిచేందుకు ఐఎంఎఫ్‌ అత్యవసర సహాయ నిధిని 50 బిలియన్‌ డాలర్ల నుంచి 100 బిలియన్‌ డాలర్లకు పెంచినట్లు వెల్లడించారు. ప్రపంచ దేశాలు అత్యవసర వైద్య పరికరాలు, ఉపకరణాలను సమకూర్చునేందుకు ‘అడ్వాన్స్‌ పర్ఛేజ్‌ ఒప్పందాల’ ద్వారా తమవంతు చేదోడు అందిస్తామని టెడ్రోస్‌ చెప్పారు. 


Updated Date - 2020-04-05T08:32:25+05:30 IST