హెచ్‌సీక్యూ: ఐసీఎమ్ఆర్ ఓకే అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ వద్దంది!

ABN , First Publish Date - 2020-05-23T19:45:54+05:30 IST

కరోనాను బారినపడకుండా ఉండేందుకు వైద్య సిబ్బందికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇవ్చొచ్చంటూ భారత వైద్య పరిశోధన మండలి సూచించిన మరోసటి రోజే ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక సూచనలు జారీ చేసింది.

హెచ్‌సీక్యూ: ఐసీఎమ్ఆర్ ఓకే అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ వద్దంది!

న్యూఢిల్లీ: కరోనాను బారినపడకుండా ఉండేందుకు వైద్య సిబ్బందికి హైడ్రాక్సీ క్లోరోక్విన్(హెచ్‌సీక్యూ) ఇవ్చొచ్చంటూ భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎమ్ఆర్) సూచించిన మరోసటి రోజే ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక సూచనలు జారీ చేసింది. కరోనా సోకకుండా నిరోధించే శక్తి హెచ్‌సీక్యూకు ఉందనడానికి శాస్త్ర పరమైన ఆధారలు లేవని మరోసారి స్పషం చేసిన డబ్ల్యహెచ్‌ఓ.. అవసరమనుకుంటే వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఈ ఔషధం ఇవ్వాలని స్పష్టం చేసింది. వైద్య సిబ్బందికి హెచ్‌సీక్యూ ఇవ్వొచ్చంటూ ఐసీఎమ్‌ఆర్ ప్రకటించిన మరుసటి రోజే డబ్ల్యూహెఓ ఈ సూచన జారీ చేయడం గమనార్హం.


కరోనాతో ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బందికి హెచ్‌సీక్యూ అందించడంపై  ఐసీఎమ్ఆర్ ఇటీవలే నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ విషయమై భారత్‌లో జరిగిన మూడు అధ్యయనాల ఫలితాలను కూడా ప్రస్తావించింది. హెచ్‌సీక్యూ తీసుకున్న వైద్య సిబ్బంది కరోనా బారినపడే అవకాశం తక్కువని ఈ అధ్యయనాల్లో వెల్లడైనట్టు తెలిపింది. అయితే.. హెచ్‌సీక్యూ తీసుకుంటే కరోనా రాదన్న భావనకు లోను కావద్దని కూడా హెచ్చరించింది.  డబ్ల్యూహెచ్ఓ మాత్రం కరోనా సోకకుండా నిరోధించే శక్తి హెచ్‌సీక్యూకు ఉందనడానికి శాస్త్ర పరమైన ఆధారలు లేవని తేల్చిచెప్పింది.

Updated Date - 2020-05-23T19:45:54+05:30 IST