గాలి ద్వారా క‌రోనా వ్యాప్తి వాద‌న‌ను కాద‌న‌లేం: డ‌బ్ల్యుహెచ్‌వో

ABN , First Publish Date - 2020-07-08T16:06:23+05:30 IST

‌గాలి ద్వారా క‌రోనా వ్యాప్తి చెందుతుంద‌నే వాద‌న‌ను కాద‌న‌లేమ‌ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 200 మందికి పైగా శాస్త్రవేత్తలు గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి...

గాలి ద్వారా క‌రోనా వ్యాప్తి వాద‌న‌ను కాద‌న‌లేం: డ‌బ్ల్యుహెచ్‌వో

జెనీవా: ‌గాలి ద్వారా క‌రోనా వ్యాప్తి చెందుతుంద‌నే వాద‌న‌ను కాద‌న‌లేమ‌ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 200 మందికి పైగా శాస్త్రవేత్తలు గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంద‌ని పేర్కొంటూ, ఇందుకు సంబంధించిన ఆధారాలను చూప‌డంతో ఈ వాద‌న‌కు డ‌బ్ల్యుహెచ్‌వో మ‌ద్ద‌తు ప‌లికింది. ఈ నేప‌ధ్యంలో కరోనా వైరస్‌కు సంబంధించి కొత్త మార్గదర్శకాలను జారీ చేయాలని శాస్త్రవేత్తల బృందం డబ్ల్యూహెచ్‌వోను కోరింది. డ‌బ్ల్యుహెచ్‌వోకు చెందిన కరోనా ఎపిడెమిక్ సాంకేతిక అధిపతి మరియా వాన్ కెర్ఖోవ్ మీడియాతో మాట్లాడుతూ వాయువు ద్వారా కూడా క‌రోనా వ్యాప్తి చెందుతుంద‌నే వాద‌న‌ను తిర‌స్క‌రించ‌లేమ‌ని అన్నారు. ‌కాగా గ‌తంలో క‌రోనా సోకిన వ్య‌క్తి ముక్కు, నోటి నుండి చిన్న బిందువుల ద్వారా వ్యాధి వ్యాప్తి చెందుతుందని, క‌రోనా బాధితులు తాకిన ఉపరితలాన్ని తాకడం ద్వారా వ్యాధి వ్యాపిస్తుందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. అయితే కొంత‌మంది  శాస్త్రవేత్తలు గాలిలో ఉన్న చిన్నపాటి కరోనా కణాల ద్వారా వ్యాధి వ్యాప్తి చెందుతుంద‌ని పేర్కొంటూ, సంబంధిత‌ ఆధారాల‌ను డబ్ల్యూహెచ్‌వోకు  స‌మ‌ర్పించారు. 

Updated Date - 2020-07-08T16:06:23+05:30 IST