ఆయుష్మాన్‌ భారత్‌ను వేగవంతం చేసేందుకు కొవిడ్‌-19 ఒక అవకాశం : డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌

ABN , First Publish Date - 2020-06-07T08:30:28+05:30 IST

కరోనా మహమ్మారి.. భారత్‌లో ఆరోగ్య బీమా పథకం ‘ఆయుష్మాన్‌ భారత్‌’ను వేగవంతం చేయడానికి ఒక అవకాశంగా

ఆయుష్మాన్‌ భారత్‌ను వేగవంతం చేసేందుకు కొవిడ్‌-19 ఒక అవకాశం : డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌

ఐక్యరాజ్యసమితి, జూన్‌ 6: కరోనా మహమ్మారి.. భారత్‌లో ఆరోగ్య బీమా పథకం ‘ఆయుష్మాన్‌ భారత్‌’ను వేగవంతం చేయడానికి ఒక అవకాశంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్‌ టెడ్రోస్‌ అథనోమ్‌ అంటున్నారు. దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘కొవిడ్‌ చాలా దురదృష్టకరమైనది. ఇది ఎన్నో దేశాలకు సవాలుగా మారింది. కానీ మనం ఈ సమయంలో అవకాశాల కోసం కూడా చూడాలి. ఉదాహరణకు భారత్‌ విషయానికి వస్తే.. ప్రధానంగా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణపై దృష్టిసారిస్తూ ఆయుష్మాన్‌ భారత్‌ను వేగవంతం చేయడానికి ఒక అవకాశం ఏర్పడుతోంది.’’ అని జెనీవాలో జరిగిన మీడియా సమావేశంలో టెడ్రోస్‌ పేర్కొన్నారు.  

Updated Date - 2020-06-07T08:30:28+05:30 IST