Sep 25 2021 @ 00:59AM

హీరోగా ‘అదిరే’ అభి

హాస్యనటుడు ‘అదిరే’ అభి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘వైట్‌ పేపర్‌’. టైటిల్‌ లుక్‌ను మనో, ఇంద్రజ, అనసూయ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక-నిర్మాత గ్రంథి శివకుమార్‌ మాట్లాడుతూ ‘‘అభి మద్దతుతో 9.51 గంటల్లో... ఒక్క రోజు లోపే సినిమా పూర్తి చేశాం. ఉత్కంఠభరిత కథనంతో తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు. ‘‘కేవలం 9.51 గంటల్లో సినిమా పూర్తి చేయాలనుకున్నప్పుడు దర్శకుడి అంకితభావం నచ్చింది. ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో మా సినిమా చోటు దక్కించుకోవడం సంతోషంగా ఉంది’’ అని అభి అన్నారు. ఈ చిత్రానికి నవనీత్‌ చారి సంగీత దర్శకుడు.