తెల్లజుట్టు నల్లగా...!

ABN , First Publish Date - 2021-02-06T19:04:35+05:30 IST

చిన్న వయసులోనే కొందరికి జుట్టు తెల్లబడుతుంటుంది. అయితే ఈ సమస్య దూరం కావాలంటే ఇదిగో ఇలా చేయండి. వెల్లుల్లి పొట్టును తీసుకుని ఒక పాత్రలో వేసి అవి బాగా నల్లగా అయ్యేవరకూ మధ్య మధ్యలో గరిటితో కలుపుతో ఫ్లేమ్‌ మీద వేగించాలి.

తెల్లజుట్టు నల్లగా...!

ఆంధ్రజ్యోతి(06-02-2021)

చిన్న వయసులోనే కొందరికి జుట్టు తెల్లబడుతుంటుంది. అయితే ఈ సమస్య దూరం కావాలంటే ఇదిగో ఇలా చేయండి.


వెల్లుల్లి పొట్టును తీసుకుని ఒక పాత్రలో వేసి అవి బాగా నల్లగా అయ్యేవరకూ మధ్య మధ్యలో గరిటితో కలుపుతో ఫ్లేమ్‌ మీద వేగించాలి.


అవి నల్లగా వేగిన తర్వాత స్టవ్‌ మీద నుంచి దించి చల్లారనివ్వాలి.


చల్లారిన తర్వాత దానిని మిక్సీలో వేసి మెత్తగా పొడిలా చేసి సీసాలో పెట్టుకోవాలి.


జుట్టుకు రాసుకోవాలనుకున్నప్పుడు ఆ పొడిని మీ జుట్టు పొడవు, ఒత్తును బట్టి తగిన పరిమాణంలో తీసుకుని ఒక గిన్నెలో పోసి అందులో తగినంత కొబ్బరినూనె వేసి పేస్టులా చేసుకోవాలి.


టైముంటే రెండు గంటలపాటు ఆ మిశ్రమాన్ని నాననిస్తే మంచిది. సమయం లేకపోతే వెంటనే కూడా ఈ పేస్టును తలకు రాసుకోవచ్చు. రాత్రి పేస్టు తయారుచేసుకుని పొద్దున తలకు బ్రష్‌తో రాసుకుని ఒక గంటపాటు అలాగే ఉంచుకోవాలి.ఆ తర్వాత షాంపుతో స్నానం చేయాలి. 


తెల్లవెంట్రుకలు ఉన్నవాళ్లు పదిహేను లేదా ఇరవై రోజులకు ఒకసారి ఈ వెల్లుల్లి పొట్టు పేస్టును ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. 


Updated Date - 2021-02-06T19:04:35+05:30 IST