అసభ్య రాతలపై కొరడా

ABN , First Publish Date - 2022-01-18T05:00:54+05:30 IST

సరదా తీరింది.. జేబు గుల్లైంది..

అసభ్య రాతలపై కొరడా
వాహనదారుడికి కౌన్సెలింగ్‌ ఇస్తున్న ట్రాఫిక్‌ సీఐ అశోక్‌

- బైక్‌కు రూ.3600 జరిమానా

     వేసిన పోలీసులు

- వాహనదారుడికి కుటుంబ పెద్దల  

    సమక్షంలో కౌన్సెలింగ్‌ 

మహబూబ్‌నగర్‌, జనవరి17: సరదా తీరింది.. జేబు గుల్లైంది..తల్లిదండ్రుల ముందు తలదించుకు నే పరిస్థితి ఏర్పడింది... ఇంతకీ ఏం జరిగిందో తె లుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.. తల్లి దండ్రులు ఎంతో కష్టపడి పిల్లలకు వాహనాలు కొనిస్తున్నారు. కొందరు పోకిరీలు వాటికి నెంబర్‌ప్లేట్‌లు వేయించుకోకుండా వాటిపై అసభ్య కర కొటేషన్‌లు రాసుకొని వాటిని చదివేవారికి రోత పుట్టిస్తున్నారు. నాలుగైదు రోజుల కిత్రం జి ల్లా కేంద్రంలో ఓ యువకుడు అసభ్యకరమైన కొటేషన్‌ను బైక్‌పై వేసుకుని తిరగడం గమనించిన ఓ జర్నలిస్ట్‌ ఫోటోతీసి వాట్సాప్‌లో షేర్‌ చేయడం వైరల్‌గా మారింది. పోలీసులు కూడా ఈ విషయా న్ని సీరియస్‌గా తీసుకొని ఆ వాహనం అడ్రస్‌ ప ట్టుకునేందుకు శ్రమించారు. ఎట్టకేలకు సోమవా రం అడ్రస్‌ తెలుసుకొని వాహనాన్ని ట్రాఫిక్‌ పో లీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. కుటుంబసభ్యుల స మక్షంలో ఆ యువకుడికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. రూ.3600 జరిమానా విధించి వసూలు చేశారు. వాహనంపై తప్పుడు కొటేషన్‌ను తొలగించి నెం బర్‌ప్లేట్‌ రాయించారు. ఇంకోసారి ఇలాంటి రాత లు రాసుకుని తిరిగితే వాహనం సీజ్‌ చేస్తామని హెచ్చరించి పంపించారు. సమాజానికి తప్పుడు  సందేశాలు ఇచ్చేలా  కొటేషన్‌లు వేయించుకుంటే  చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రతి వాహనదారుడు మోటార్‌వెహికిల్‌ నిబంధ నల మేరకు నెంబర్‌ ప్లేట్‌ అమర్చుకోవాలని లేదంటే చర్యలు తీసుకుంటామన్నారు. 

Updated Date - 2022-01-18T05:00:54+05:30 IST