Advertisement
Advertisement
Abn logo
Advertisement

మరిది కదా అని భార్యతో చనువుగా ఉంటున్నా పట్టించుకోని భర్త.. చివరకు ఈ కుర్రాడు ఎంత పనిచేశాడంటే..

ఇంటర్నెట్ డెస్క్:  మొబైల్‌ ఫోన్‌లో లూడో ఆట ఎలా ఆడాలో తెలియక ఆమె తరచూ తికమక పడేది. దీంతో మరిది ఆమెకు అవసరమైనప్పుడల్లా సాయం చేసేవాడు. అలా వారి మధ్య దగ్గరితనం పెరిగింది. మొదట్లో స్నేహితుల్లాగానే ఉండేవారు. మొబైల్ గేమ్స్‌లో మునిగిపోయి.. నవ్వుతూ, తుళ్లుతూ కబుర్లు చెప్పుకుంటూ సరదాగా గడిపేసేవారు. ఈ దృశ్యాలు పలు మార్లు భర్త కంట పడ్డాయి కానీ.. అతడు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. గేమ్స్‌లో పడిపోతే ఎవరైనా అంతే..అవసరంగా మనసు పాడు చేసుకోవడం సరికాదు అని అనుకున్నాడు. ఆ తరువాత.. వారి జీవితాలు అనూహ్య మలుపులు తిరిగాయి. చివరికి.. అత్తింటివారి వల్లే తన జీవితం నాశనమైపోయిందంటూ ఆమె పోలీసులను ఆశ్రయించింది.

జోధ్‌పూర్ జిల్లాకు చెందిన నీతూకు కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. భర్త ఆమె కంటే దాదాపు ఎనిమిదేళ్లు పెద్ద. ఇక నీతూ.. బోరు కొట్టినప్పుడల్లా మొబైల్‌లో లూడో ఆట ఆడుతుండేది. అయితే.. మొబైల్ గేమ్స్‌పై ఆమెకు పెద్దగా అవగాహన  అప్పుడప్పుడూ ఇబ్బంది పడేది. ఈ క్రమంలో నీతుకు ఆమె మరిది ప్రవీణ్ సహాయపడేవాడు. అలా వదినా మరిది మధ్య చనువు ఏర్పడింది. దాదాపు ఒకే వయసులో ఉన్న ఇద్దరూ మొబైల్ గేమ్స్‌లో పడిపోయి కాలాన్నే మర్చిపోయేవారు. ఈ దగ్గరితనం మరింత ముదిరి ప్రేమగా మారింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేమనుకునే స్థితికి వారిద్దరూ చేరుకున్నారు. దీంతో.. జులై 30న వదినా, మరిది అకస్మాత్తుగా ఇంట్లో నుంచి పారిపోయారు. 

ఆ తరువాత.. జోధ్‌పూర్ నగరంలో ఇల్లు అద్దెకు తీసుకుని సహజీవనం ప్రారంభించారు. కొంత కాలం పోయాక రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ఇటీవలే ప్రవీణ్ ఇందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు. మరి కొద్ది రోజుల్లో పెళ్లి అనగా.. ప్రవీణ్ అకస్మాత్తుగా అదృశ్యమైపోయాడు. దీంతో..దిక్కొతోచని స్థితిలో పడిపోయిన నీతు చివరకు పోలీసులను ఆశ్రయించింది. భర్త, అతడు కుటుంబసభ్యులే ప్రవీణ్‌ను ఎదో చేసి ఉంటారంటూ ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉంటే పోలీసుల ప్రాథమిక విచారణలో కొన్ని కీలకమై విషయాలు వెలుగు చూశాయి. భార్యభర్తల మధ్య వయసు తేడా ఎక్కువగా ఉండటంలో ఇద్దరూ మానసికంగా దగ్గరకాలేకపోయారని, తరచూ గొడవలు పడుతూ ఉండేవారని పోలీసులు తెలుసుకున్నారు. ఇక ప్రవీణ్ ఆచూకీ ఇప్పటివరకూ తెలియకపోవడంతో అతడి కోసం పోలీసులు ప్రస్తుతం ముమ్మరంగా గాలిస్తున్నారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement