అందరూ చూస్తుండగానే..

ABN , First Publish Date - 2022-01-21T06:07:47+05:30 IST

కుల సంఘ సభ్యులు అందరూ చూస్తుండగా.. సాక్షాత్తూ సంఘ భవనంలోనే, పట్ట పగలు ఏకంగా ము గ్గురి హత్య.

అందరూ చూస్తుండగానే..

ముగ్గురి హతం

మృతులు తండ్రీకొడుకులు

మంత్రాలు చేస్తున్నారనే కారణంతోనే హత్య అనే అనుమానాలు

టీఆర్‌నగర్‌లో విషాదం

జగిత్యాల రూరల్‌, జనవరి 20 : కుల సంఘ సభ్యులు అందరూ చూస్తుండగా.. సాక్షాత్తూ సంఘ భవనంలోనే, పట్ట పగలు ఏకంగా ము గ్గురి హత్య. అందునా జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నాయి. మారుమూ ల గ్రామంలోనో, చీకటి పడిన సమయాన్నో, ఎవరూ లేని వేళల్లో సాధా రణంగా నేరాలు చోటుచేసుకుంటాయి. ఇందుకు భిన్నంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో సంఘ భవనంలో, సర్వసభ్య సమావేశంలో, కుల సం ఘ సభ్యులు అందరూ చూస్తుండగానే ముగ్గురు హత్యకు గురికావడం జిల్లా ప్రజలను తీవ్ర భయంలోకి నెట్టేసింది. జిల్లా కేంద్రంలోని టీఆర్‌ నగర్‌ గురువారం జరిగిన దారుణ హత్య సంఘటన కలకలం రేపింది. మంత్రాల నెపంతో కొందరు కుల సంఘ సభులు తండ్రితోపాటు ఇద్దరు కుమారులను అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... జిల్లా కేంద్రంలోని టీఆర్‌నగర్‌ గ్రామానికి చెందిన జగన్నాథం నాగేశ్వర్‌రావు (65)జగన్నాథం రాంబాబు (35)జగన్నాథం రమేష్‌(23)లు వడ్డీవ్యాపారంతో పాటు సెప్టిక్‌ ట్యాంక్‌ శుభ్రం చేసే వాహనాలను నడుపుతూ జీవనం సాగిస్తున్నారు.  నాగేశ్వ ర్‌రావు గ్రామంలో వారి కుల సంఘానికి పెద్దమనిషిగా వ్యవహరిస్తు న్నాడు. నాగేశ్వర్‌రావుకు మంత్రాల నేపథ్యం ఉన్నట్లు స్థానికులు కొద్ది రో జులుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగానే నాగేశ్వర్‌ రావు తన కుమారులైన రాంబాబు, రమేష్‌లకు మంత్రాలపై శిక్షణ ఇ చ్చేందుకు అగ్రహారం వద్ద క్షుద్రపూజలు నిర్వహించడానికి నెల క్రితం వెళ్లారు. క్షద్రపూజలు చేస్తున్న సమయంలో అక్కడి ప్రజలు నాగేశ్వర్‌ రా వుతోపాటు, అతడి కుమారులను చితకబాదారు. ఈ దాడి విషయం టీఆర్‌నగర్‌లో వ్యాపించింది. దీంతో నాగేశ్వర్‌రావు కులానికి చెందిన కొం తమంది భయబ్రాంతులకు లోనయ్యారు. నాగేశ్వర్‌రావు కుటుంబసభ్యు లకు మంత్రాలు రావడం వల్ల ఎప్పటికైనా కీడు జరుగుతుందని భావిం చిన టీఆర్‌నగర్‌ గ్రామంలోని ఎరుకల సంక్షేమ సంఘం కులానికి చెందిన కొందరు ఎలాగైనా నాగేశ్వర్‌రావు కుటుంబాన్ని అంతమొందిం చాలని పథకం పన్నారు. ఇందులో భాగంగానే ప్రతి ఆరు నెలలకోసారి 20వ తేదీన గ్రామంలోని కులసంఘభవనంలో జరిగే సమావేశంలో   హత్యకు రూపపల్పన చేశారు. సంఘ భవనంలో సమావేశం జరుగు తున్న సమయంలో కొందరు కుల సంఘ సభ్యులకు నాగేశ్వర్‌రావుకు మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ గొడవలో నాగేశ్వర్‌రావుకు మద్దతుగా తన కొడుకులు రాంబాబు, రమేష్‌లు కూడా సభ్యులతో వాదనకు దిగారు. అప్పటికే పక్కాప్లాన్‌ ప్రకారం ముకుమ్మడిగా మారణాయుధా లతో ఉన్న కొంతమంది నాగేశ్వర్‌రావు, రాంబాబు, రమేష్‌లపై విచక్షణా రహితంగా గొడ్డలితో దాడి చేసి చంపారు. నాగేశ్వర్‌రావు, రాంబాబులకు  గొంతుకు, వీపు భాగాల్లో తీవ్రగాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందారు. రమేష్‌కు మెడపై, వీపు భాగంలో తీవ్రగాయాలుకాగా జగి త్యాలలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందాడు. అయితే నాగేశ్వర్‌రావు రెండో భార్య కుమారుడు రాజేష్‌ సంఘటనా స్థలం నుంచి తప్పించుకొని పారిపోయాడు. మరో కుమారుడు విజయ్‌ ఊళ్లో లేకపోవడంతో సమావేశానికి హాజరుకాలేదు.


తొమ్మిదేళ్ల క్రితం వలస వచ్చి.. 

నాగేశ్వర్‌రావు కుటుంబం తొమ్మిదేళ్ల క్రితం జగిత్యాల రూరల్‌ మం డలంలోని కల్లెడ గ్రామం నుంచి వలస వచ్చి టీఆర్‌నగర్‌ గ్రామంలో స్థిరపడ్డట్లు స్దానికులు పేర్కొంటున్నారు. నాగేశ్వర్‌రావుకు ఇద్దరు భార్య లు. మొదటి భార్య సుంకమ్మ, రెండో భార్య కనుకమ్మ ఉన్నారు. మొద టి భార్యకు కూతురు రాజేశ్వరి, కుమారులు రాంబాబు, రమేష్‌, రాజేష్‌ లు ఉన్నారు. రెండో భార్యకు కుమారుడు విజయ్‌, కూతురు మంగ ఉన్నారు.

క్షద్రపూజల కోసం అగ్రహారానికి....?

నాగేశ్వర్‌రావు కుమారులైన రాంబాబు, రమేష్‌లకు మంత్రాల పై శిక్ష ణ కోసం అగ్రహారం గ్రామంలోని ఓ మారుమూల ప్రాంతంలో క్షద్రపూ జలు చేస్తుండగా అక్కడిస్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసినట్లు టీఆర్‌ నగర్‌ గ్రామస్థులు పేర్కొంటున్నారు. అప్పటి నుంచి నాగేశ్వర్‌రావుకు గిట్టని కొంతమంది కుల సంఘసభ్యులు నాగేశ్వర్‌రావుపై క్షక్ష పెంచు కున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు.

గ్రామంలో పోలీస్‌ పికెటింగ్‌...

టీఆర్‌నగర్‌ గ్రామంలో హత్య జరిగిన ప్రదేశాన్ని ఎస్పీ సింధుశర్మ, అడిషనల్‌ ఎస్పీ రూపేష్‌, డీఎస్పీ ప్రకాశ్‌ సందర్శించారు. డాగ్‌ స్వ్కాడ్‌ లతో హత్య జరిగిన స్థలాన్ని జల్లెడ పట్టారు. జగిత్యాల రూరల్‌ సీఐ కృష్ణకుమార్‌ ఆధ్వర్యంలో రూరల్‌ ఎస్సై అనిల్‌, బీర్‌పూర్‌ ఎస్సై శ్రీకాంత్‌, సారంగాపూర్‌ ఎస్సై లతో గ్రామంలో భారీ పోలీస్‌ పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. హత్యలో 15 మంది హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తు న్నారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అనుమానాలు ఎన్నో....

టీఆర్‌ నగర్‌కు చెందిన నాగేశ్వర్‌రావుతో పాటు ఆయన కుమారులు  హత్యకు గురైన సంఘటనలో స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నాగేశ్వర్‌ రావు కుటుంబ సభ్యులు మంత్రాలు చేస్తున్నారన్న అనుమానంతో పథకం ప్రకారమే హత్య చేశారా.. లేక సంఘ సమా వేశంలో గొడవ జరిగి హత్యకు దారి తీసిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సంఘటనకు పథకం వేసింది ఎవరు.. నేరస్థులకు సహకరించింది ఎవరె వరు అన్న అనుమానాలు స్థానికంగా తలెత్తుతున్నాయి. ఎస్సీ సిందూ శర్మ నేతృత్వంలో జరుగుతున్న విచారణలో అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Updated Date - 2022-01-21T06:07:47+05:30 IST