కొవ్వు తగ్గడానికి నిమ్మరసం, తేనె మంచిదా? లేక జీలకర్ర, మెంతులు మంచివా?

ABN , First Publish Date - 2021-12-11T20:56:21+05:30 IST

చాలా మంది ఉదయాన్నే వేడినీళ్లలో నిమ్మరసం, తేనె వేసుకొని తాగుతారు. దీని వల్ల సులభంగా విరోచనం కావటం.. కొవ్వు తగ్గటం.. పొట్ట ఉబ్బరం తగ్గటం వంటి లాభాలు ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో కొందరు

కొవ్వు తగ్గడానికి నిమ్మరసం, తేనె మంచిదా? లేక జీలకర్ర, మెంతులు మంచివా?

ఆంధ్రజ్యోతి(11-12-2021)

చాలా మంది ఉదయాన్నే వేడినీళ్లలో నిమ్మరసం, తేనె వేసుకొని తాగుతారు. దీని వల్ల సులభంగా విరోచనం కావటం.. కొవ్వు తగ్గటం.. పొట్ట ఉబ్బరం తగ్గటం వంటి లాభాలు ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో కొందరు జీలకర్ర, మెంతులను ఒక రోజు రాత్రంతా నానబెట్టి.. ఉదయాన్నే తాగుతున్నారు. దీని వల్ల కూడా కడుపు ఉబ్బరం తగ్గుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే నెట్టింట- ఈ రెండు రకాల పానీయాల్లో ఏది బెస్ట్‌ అనే చర్చ నడుస్తోంది. నిమ్మకాయ, తేనె వల్ల మన కడుపులో ఉన్న వాయువులు బయటకు వచ్చి శరీరం తేలిక పడుతుంది. ఇక మెంతులు, జీలకర్ర నీళ్లను మధుమేహం ఉన్నవారిని వాడమని చాలా కాలంగా వైద్యనిపుణులు సిఫార్సు చేస్తున్నారు. అందువల్ల ఈ రెండు రకాల పానీయాలలో దేనిని తాగిన శరీరానికి మంచే జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. అయితే జీలకర్ర నీళ్లు శరీరానికి వేడి చేస్తాయని.. అందువల్ల ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలో వీటిని తాగకపోవటం మంచిదని కూడా చెబుతున్నారు. 

Updated Date - 2021-12-11T20:56:21+05:30 IST