Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్యాకెట్ పాలు.. విడి పాలు.. ఏది మంచిది..?

ఆంధ్రజ్యోతి(26-10-2020)

ప్రశ్న: ప్యాకెట్‌ పాలు మంచివా లేక విడిగా దొరికే పాలు మంచివా?


- నాసీర్‌, వరంగల్‌ 


డాక్టర్ సమాధానం: పాలు, పాల ఉత్పత్తులను ఎన్నుకునేటప్పుడు, పాశ్చరైజ్డ్‌, పాశ్చరైజ్‌ చేయని పాల మధ్య తేడాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. ప్యాకెట్‌ లో లభించే పాలు పాశ్చరైజ్డ్‌ చేయబడి ఉంటాయి. పాశ్చరైజేషన్‌ ప్రక్రియలో పాలను వేడి చేసి చల్లార్చి ఆ తరువాత ప్యాకెట్లలో నింపుతారు. ఈ ప్రక్రియ ద్వారా పాలలోని వ్యాధికారక సూక్ష్మ జీవులు నశిస్తాయి. ప్యాకెట్‌లలో దొరికే పాలు వివిధ పాళ్ళలో వెన్నను కలిగి ఉంటాయి. అందువల్ల ప్యాకెట్‌ పాలు కొనేప్పుడు మనకు కావలసిన వెన్న శాతం ఉన్న పాలను ఎంచుకొనే అవకాశం ఉంది. సాధారణంగా పెద్ద కంపెనీ బ్రాండ్ల నుండి పాకెట్లో దొరికే పాలు కల్తీ అయ్యే అవకాశం చాలా తక్కువ. విడిగా దొరికే పాలలో నీళ్లు కలపడం, మరో విధంగా అయినా కల్తీ చేసే అవకాశం ఎక్కువ. విడిగా పాలు కొనేప్పుడు అవి పితికిన సమయం నుండి గంట లోపు మీకు అందే విధంగా ఉంటే మంచిది. విడిగా పాలను కొన్నప్పుడు తప్పనిసరిగా ఓసారైనా కాచిన తరువాత మాత్రమే వాడాలి. పాలు పాకెట్లో కొన్నా, విడిగా కొన్నా వాటి పోషక విలువలలో మాత్రం పెద్దగా తేడాలుండవు.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com (పాఠకులు తమ సందేహాలను

[email protected] కు పంపవచ్చు)

Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...