Rama tulsi or Krishna tulsi: ఏ తులసి మనకు ఆరోగ్యకరమైనది? ఏది ఎక్కువ మేలు చేస్తుంది.

ABN , First Publish Date - 2022-09-22T17:28:09+05:30 IST

తులసి మన భారతదేశంలో పవిత్రమైన మొక్కగా భావిస్తాం.. అలాగే పూజిస్తాం..., భక్తి భావనతోనే కాకుండా తులసి అనేక ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంటుంది.

Rama tulsi or Krishna tulsi: ఏ తులసి మనకు ఆరోగ్యకరమైనది? ఏది ఎక్కువ మేలు చేస్తుంది.

తులసి మన భారతదేశంలో పవిత్రమైన మొక్కగా భావిస్తాం.. అలాగే పూజిస్తాం..., భక్తి భావనతోనే కాకుండా తులసి అనేక ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంటుంది. దాని సంపూర్ణ లక్షణాల కారణంగా, ఈ హెర్బ్ అనేక ఆయుర్వేద, ప్రకృతివైద్య ఔషధాలలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు కూడా. 


తులసిలో అనేక రకాలు ఉన్నాయి. వీటిని శ్యామ తులసి, 'ముదురు తులసి' లేదా 'కృష్ణ తులసి' అని కూడా పిలుస్తారు, ఇది ముదురు ఆకుపచ్చ, ఊదా రంగు ఆకులతో ఊదా కాండంతో ఉంటుంది. రామ తులసి, కృష్ణ తులసి అనే రకాలను సాధారణంగా మనం చూస్తున్నవే... అయితే, రెండింటి మధ్య తేడా ఏమిటి? వేటితో ఆరోగ్యం పొందడం కోసం మీరు దేనిని ఎంచుకోవాలి?


తులసి ఔషధ శక్తులకు ప్రసిద్ధి చెందింది. రామతులసి రకం ఆకులు ఇతర రకాల తులసి కంటే తియ్యని రుచిని కలిగి ఉంటాయి. రామ తులసిని హిందూమతంలో గొప్ప ఔషధంగా పరిగణిస్తారు. దీనిని మతపరమైన సందర్భాలలో పండుగ ఆచారాలకు పవిత్రంగా భావిస్తారు. కృష్ణ తులసిని, ఊదారంగు తులసి ఆకు అని కూడా పిలుస్తారు., దీనిలో అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఇతర వెరైటీలతో పోలిస్తే రుచిలో చేదు తక్కువగా ఉంటుంది.


ఏది ఆరోగ్యకరమైనది?


ఈ రెండు రకాల తులసి ఆకులు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. 


1. జ్వరం, చర్మ వ్యాధి, జీర్ణక్రియ, జీవక్రియ, రోగనిరోధక శక్తికి రెండూ సహాయపడతాయి. 

2. ఇది ఆందోళన సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. 

3. తులసి నీరు కొవ్వు తగ్గించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

4.  నోటి దుర్వాసన ఉన్నవారికి తులసి మంచిది. 

5. దగ్గు, జలుబుకు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల త్వరగా ఉపసమనాన్ని పొందవచ్చు. 


తులసి మానవులకు ప్రకృతి ఇచ్చిన బహుమతి...


1. రామ తులసి మంచి జీర్ణవ్యవస్థను సులభతరం చేస్తుంది.

2. కృష్ణ తులసి శ్వాసకోశ సమస్యలు, చర్మ వ్యాధులు, ఇతర ఆరోగ్య ప్రమాదాలకు నివారణగా పనిచేస్తుంది. 

3. రామ తులసి మనలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది క్యాన్సర్ నిరోధక గుణాలను కలిగి ఉండి, మంచి జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది.

4. జలుబు, దగ్గు సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు తరచుగా కృష్ణ తులసిని తినిపిస్తారు. ఇది అధిక జ్వరానికి కూడా ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు గుండె ఆరోగ్యానికి, మధుమేహ రోగులకు కూడా మేలు చేస్తాయి. తులసి చర్మాన్ని ప్రకాశవంతంగా, మెరిసేలా చేస్తుంది. జుట్టు పొడవుగా పెంచుతుంది.


ఎలా తీసుకోవాలి?

తులసిని టీ లో తీసుకోవడం వల్ల రక్త శుద్దికి సహాయపడుతుంది. 

Updated Date - 2022-09-22T17:28:09+05:30 IST