వైరస్‌ను చంపడానికి ఇవి తిందాం!

ABN , First Publish Date - 2020-04-20T18:28:32+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్‌-19కి ప్రస్తుతం మందు లేకపోవచ్చు కానీ, దానితో పోరాడి గెలిచే శక్తి మానవ శరీరానికి చాలానే ఉంది. గణాంకాలను పరిశీలిస్తే 94 శాతం మంది

వైరస్‌ను చంపడానికి ఇవి తిందాం!

ఆంధ్రజ్యోతి(20-04-2020)

ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్‌-19కి ప్రస్తుతం మందు లేకపోవచ్చు కానీ, దానితో పోరాడి గెలిచే శక్తి మానవ శరీరానికి చాలానే ఉంది. గణాంకాలను పరిశీలిస్తే 94 శాతం మంది ఈ వైర్‌సతో పోరాడి గెలుస్తున్నారు. ఈ గెలుపు మానవశరీరంలోని రోగనిరోధక శక్తి వల్ల మాత్రమే అని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవడమే ఈ మహమ్మారికి సరైన మందు. ఇందుకు అనుగుణమైన ఆహారం తీసుకోవడమే మార్గం.


శరీరంలో రోగనిరోధక వ్యవస్థలివే...

తెల్లరక్తకణాలు, వినాళగ్రంథి, ప్లీహం (స్ప్లీన్‌) శోషరస వ్యవస్థ (కాంప్లిమెంటరీ సిస్టం), ఎముక మజ్జ (బోన్‌ మారో), చర్మం.


ఇమ్యూన్‌ సిస్టం బూస్టర్స్‌ ... 

సిట్రస్‌ పండ్లు: తెల్లరక్తకణాల ఉత్పత్తికి తోడ్పడుతాయి. నిమ్మ, నారింజ, ద్రాక్ష.


రెడ్‌బెల్‌ పెప్పర్‌: సిట్రస్‌ పండ్లకంటే విటమిన్‌-సి రెట్టింపు ఉంటుంది. రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. 


బ్రోకోలి: విటమిన్‌ ఎ, బి, సి, ఈలు లభిస్తాయి. పీచుపదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్స్‌ ఎక్కువగా ఉంటాయి.


వెల్లుల్లి: వ్యాధి కారకాలతో పోరాడుతుంది. రక్తపీడనం తగ్గిస్తుంది. దీనిలోని అల్లిసిన్‌ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.


అల్లం: వాపులు, గొంతు సంబంధిత వ్యాధులు నయం చేయడంతోపాటూ, కొలెస్టరాల్‌ను తగ్గిస్తుంది.


పాలకూర: ఇందులో విటమిన్‌-సి, బీటాకెరోటిన్‌, యాంటా ఆక్సిడెంట్లు ఉంటాయి.


యోగర్ట్‌: వ్యాధి కారకాలతో పోరాడుతుంది. ఇందులో ఉండే విటమిన్‌-డి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.


బాదం: ఇందులోని విటమిన్‌-ఇ వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది.


పసుపు: ఇందులోని కర్కుమిన్‌ కండరాలలో కలిగే గాయాలను, వాపులను నిరోధిస్తుంది. 


గ్రీన్‌ టీ: దీనిలోని ఫ్లేవనాయడ్స్‌ యాంటీ ఆక్సిడెంట్స్‌గా పనిచేస్తాయి. ఎల్‌-థియానైన్‌ అనే అమైనా ఆమ్లం  టీ-సెల్స్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది.


బొప్పాయి: విటమిన్‌ సి, బి, ఎ, కె ఎక్కువ. దీనిలోని పపైన్‌ వాపులను నివారిస్తుంది.


పౌల్ట్రీ: టర్కీ చికెన్‌, కోడిమాంసం, చికెన్‌ సూప్స్‌ వల్ల ఆహార నాళం ఆరోగ్యకరంగా ఉంటుంది. విటమిన్‌-బి ఎక్కువ. 


షెల్‌ఫిష్‌: పీతలు, లోబెస్టెర్స్‌, మస్సల్స్‌లో జింక్‌ ఎక్కువ. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 


ఆహారం ఇలా తీసుకోండి...

ఉదయం 6.30 గంటలకు: వేడినీళ్లు, సగం నిమ్మకాయ, సగం టీస్పూన్‌ జీరా గోరువెచ్చని నీటితో, 45 నిమిషాల శారీరక శ్రమ (వాకింగ్‌, జాగింగ్‌), ఖర్జూర పండు లేదా అంజీర్‌ పండు, నాలుగు బాదం పలుకులు


7.30: గ్రీన్‌టీ... తులసి, అల్లం, పుదీనా, లవంగం, నిమ్మరసంతో.


9.00: బ్రేక్‌ఫాస్ట్‌ వెజిటబుల్‌ సలాడ్‌, మొలకెత్తిన విత్తనాలు, ఓట్స్‌, ఉప్మా లేదా ఉడకబెట్టిన కోడిగుడ్లు రెండు


11.00: ఆరెంజ్‌, పుచ్చకాయ, దానిమ్మ, దోసపండు


మధ్యాహ్నం ఒంటి గంట: మధ్యాహ్న భోజనం- జొన్నరొట్టెలు రెండు, కప్పు అన్నం, ఒక కప్పు కూరగాయలు, దాల్‌, పెరుగు, చట్నీ, చేపలు, చికెన్‌, ఆకుకూరలు


సాయంత్రం 4 గంటలు: నారింజ, ద్రాక్ష, నిమ్మ, జామ


5 గంటలు: హెర్బల్‌ టీ, గ్రీన్‌టీ, 30 నిమిషాలు శారీరక శ్రమ


రాత్రి 8 గంటలు: దాల్‌ కిచిడీ, రోటి, వెజిటబుల్స్‌, ఆకుకూరలు, 30 నిమిషాల శారీరక శ్రమ (వాకింగ్‌)


10 గంటలు: 1/4 టీస్పూన్‌ పసుపు, 1/4 టీస్పూన్‌ అల్లం, ఒక కప్పు వేడినీరు.


పడుకునే ముందు ఒక కప్పు పాలు (పసుపు లేదా మిరియాలు వేసుకుని)


ఫ బి.లక్ష్మీకాంతం,

విశ్రాంత ఐఏఎస్‌

Updated Date - 2020-04-20T18:28:32+05:30 IST