Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఈ సీజన్‌లో... ఎలాంటి ఆహారం?

ఆంధ్రజ్యోతి(26-03-2021)

ప్రశ్న: వేసవికాలంలో ఆహార పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?


- లక్ష్మీ ప్రియ, వైజాగ్‌


డాక్టర్ సమాధానం: ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరం నుండి నీరు ఎక్కువగా పోతుంది. చెమట బాగా పట్టేవారికి ఆ నీటితో పాటు ఖనిజ లవణాలు కూడా పోతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు వీటిని తిరిగి భర్తీ చేసుకునేలా ఆహారం ఉండాలి. ఇలా కానప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరిగి, వడ దెబ్బ తగలడం, కళ్ళు తిరిగి పడిపోవడం వంటివి జరుగుతాయి. ఇవి నివారించాలంటే రోజుకు కనీసం మూడు లీటర్ల నీరు ఏదో ఒక రూపంలో తీసుకోవాలి. మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, భోజనంలో సాంబార్‌ లేదా రసం లేదా సూప్స్‌ తీసుకోవడం మొదలైనవన్నీ ఉపయోగపడతాయి. నీరు అధికంగా ఉండే పుచ్చ, కర్బుజా, ద్రాక్ష వంటి పండ్లను కూడా రోజుకు ఒకటి రెండుసార్లు తీసుకుంటే మంచిది. కారం, మసాలాలు ఉన్న ఆహారం తగ్గించాలి. నూనెలు ఎక్కువగా ఉండే వేపుళ్ళు, బేకరి ఫుడ్స్‌, ఫాస్ట్‌ ఫుడ్స్‌ మొదలైనవి మానెయ్యాలి. వ్యాయాయం చేసేవారైతే తప్పనిసరిగా వ్యాయామానికి ముందు, తరువాత  అరలీటరు నీళ్లు తీసుకోవాలి. గంట కంటే ఎక్కువ వ్యాయామం చేస్తే ఎలెకో్ట్రలైట్స్‌తో కూడిన నీళ్లు తాగడం మంచిది.


డా. లహరి సూరపనేని 

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

[email protected]కు పంపవచ్చు)

Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...