శాకాహారులకు బలాన్నిచ్చే ఆహారం ఏంటి?

ABN , First Publish Date - 2022-04-15T19:12:40+05:30 IST

ఆహారంలోని పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వుల నుండి మనకు శక్తి వస్తుంది. ఈ శక్తినిచ్చే పదార్థాలను మన శరీరం శోషించుకునేందుకు, వాటిని

శాకాహారులకు బలాన్నిచ్చే ఆహారం ఏంటి?

ఆంధ్రజ్యోతి(15-04-2022)

ప్రశ్న: శాకాహారులకు చక్కటి బలాన్ని, శక్తినిచ్చే ఆహార పదార్థాలు ఏవి?


- నర్మద, సిరిసిల్ల


డాక్టర్ సమాధానం: ఆహారంలోని పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వుల నుండి మనకు శక్తి వస్తుంది. ఈ శక్తినిచ్చే పదార్థాలను మన శరీరం శోషించుకునేందుకు, వాటిని సరిగా ఉపయోగించుకునేందుకు విటమిన్లు, ఖనిజాలు అవసరం. కాబట్టి అన్ని రకాల పోషకవిలువలు కలిగిన సమతులాహారం మాత్రమే సంపూర్ణ ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. శాకాహారులు సమతులాహారం కోసం అన్నం, గోధుమలు, రొట్టెలు, పాస్తా, చిరు ధాన్యాలు మొదలైనవి; ప్రొటీన్ల కోసం పప్పు ధాన్యాలు, సోయా, సెనగలు, అలసందలు మొదలైనవి; మీల్‌ మేకర్‌, పనీర్‌, సోయా పనీర్‌, పాలు, పెరుగు కూడా అధికంగా తీసుకోవాలి. ఆరోగ్యకరమైన కొవ్వుల కోసం పల్లీలు, బాదం, జీడిపప్పు, ఆక్రోట్‌, పిస్తా లాంటివి కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు. తాజా కూరగాయలు, ఆకుకూరలు, కాలానుగుణంగా లభించే పండ్లు తగు మోతాదులో తీసుకొంటే పీచు పదార్ధాలు, విటమిన్లు కూడా పుష్కలంగా లభిస్తాయి.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2022-04-15T19:12:40+05:30 IST