Advertisement
Advertisement
Abn logo
Advertisement

బరువు సరిగా పెరగడం లేదు.. ఎందుకలా?

ఆంధ్రజ్యోతి(01-01-2021)

ప్రశ్న: మాకు కవల పిల్లలు. వారికి పద్నాలుగు నెలలు. బరువు సరిగా పెరగడం లేదు. ఎటువంటి ఆహారం ఇవ్వాలి?


- చంద్రశేఖర్‌, శ్రీకాకుళం

 

డాక్టర్ సమాధానం: సాధారణంగా మొదటి సంవత్సరంలో పిల్లలు వారు పుట్టినప్పుడు ఉన్న బరువుకు మూడు రెట్లు బరువు పెరుగుతారు. మీ పిల్లలు ఎత్తు పెరుగుతూ ఉన్నారు. కాబట్టి బరువు పెరగక పోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎత్తు, బరువు రెండూ పెరగకపోతే పోషకపదార్థాల లోపం లేదా జీర్ణవ్యవస్థలో సమస్య లేదా ఏదైనా వేరే ఆరోగ్యపరమైన కారణాలు కావచ్చు. ముందుగా బరువు పెరగకపోవడానికి కారణం వైద్యులను అడిగి తెలుసుకోండి. ఏడాది నుండి ఏడాదిన్నర వయసున్న పిల్లలకు ఎక్కువగా ఘనాహారం ఇవ్వాలి. అన్నం, పాలలో నానబెట్టిన రొట్టె వంటి పిండిపదార్థాలు శక్తినిస్తాయి. ఎదగడానికి ఉపయోగపడే ప్రొటీన్ల కోసం రోజుకు ఓ గుడ్డు, పప్పు, అప్పుడప్పుడు మాంసాహారం పెట్టండి. ఉడికించిన కూరగాయలు, ఆకుకూరలను అన్నంలో కలిపి తినిపించండి. మెత్తగా నలిపిన పండ్లు రోజుకోసారైనా పెట్టాలి. రెండుసార్లు పాలు లేదా పెరుగు కూడా ఇవ్వండి. వెన్నతీయని పాలను మాత్రమే పిల్లలకు ఇవ్వాలి. కెలోరీలు పెంచేందుకు ఆహారంలో నెయ్యి వేసి పెట్టవచ్చు. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com (పాఠకులు తమ సందేహాలను 

[email protected] కు పంపవచ్చు)


Advertisement

పిల్లల సంరక్షణమరిన్ని...

Advertisement