Advertisement
Advertisement
Abn logo
Advertisement

వ్యాయామం చేసేవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

ఆంధ్రజ్యోతి(25-11-2020)

ప్రశ్న: వ్యాయామశాలలో రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?


- అనఘ, హైదరాబాద్‌


డాక్టర్ సమాధానం: రోజూ గంటసేపు, వారానికి ఐదు రోజులు వ్యాయామం చెయ్యడం ఆరోగ్యానికి చాలా మంచిది. వ్యాయాయ ఫలితాలు సరిగా ఉండాలంటే తగిన ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా, వ్యాయామానికి ముందు, తరువాత తీసుకునే ఆహారం సరైనది కాకపోతే వ్యాయామ సత్ఫలితాలు సరిగా అందకపోవచ్చు. వ్యాయామం చేయడానికి అరగంట ముందు ఒక అరటి పండు లేదా రెండు ఖర్జురాలు తీసు కుంటే మీరు వ్యాయామం అలసట లేకుండా చేయడానికి కావలసిన శక్తి వస్తుంది. వ్యాయామం చేసే సమయంలో మధ్యలో కొద్దిగా నీళ్లు తాగాలి. ఒక వేళ మీ వ్యాయామ సమయం గంటన్నర కంటే ఎక్కువగా ఉంటే మధ్యలో ఆహారాన్ని తీసుకోండి. వ్యాయామం ముగిసిన తరువాత ముప్పై నుండి నలభై నిమిషాల లోపు అరటిపండు మిల్క్‌షేక్‌ కానీ, బాదం, ఆక్రోట్‌ గింజలు లేదా తాజా పళ్ళు, పెరుగు లాంటివి తీసుకుంటే మంచిది. అర లీటరు నుండి ముప్పావు లీటర్‌ నీళ్లు తాగితే చెమట ద్వారా పోయిన నీటిని భర్తీ చేసుకోవచ్చు. ప్రోటీన్‌ కోసం గుడ్లు, చికెన్‌, చేప; శాకాహారులైతే పప్పు ధాన్యాలు, సెనగలు, రాజ్మా, అల సందలు తీసుకోవచ్చు. దీని వల్ల అలసట తగ్గి, శరీరం త్వరగా కోలు కుంటుంది. వ్యాయామం చేయని రోజుల్లో కూడా ఆహారం, నిద్ర విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.


డా. లహరి సూరపనేని 

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌ 

nutrifulyou.com (పాఠకులు తమ సందేహాలను

[email protected]కు పంపవచ్చు)


Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...