రొమ్ము క్యాన్సర్‌.. ఏ ఆహారం మంచిది?

ABN , First Publish Date - 2022-06-04T19:34:27+05:30 IST

రొమ్ము క్యాన్సర్‌ మహిళల్లో అధికంగా వస్తుంది. కొంతమంది మగవాళ్లలోనూ రొమ్ము క్యాన్సర్‌ వచ్చినా, స్త్రీలతో పోలిస్తే వీరి సంఖ్య కేవలం ఒక శాతం మాత్రమే. జన్యు ఉత్పరివర్తనాలు;

రొమ్ము క్యాన్సర్‌.. ఏ ఆహారం మంచిది?

ఆంధ్రజ్యోతి(03-06-2022)

ప్రశ్న: మా అమ్మగారికి రొమ్ము క్యాన్సర్‌ చికిత్స జరుగుతోంది. ఎలాంటి ఆహారం తీసుకోవాలి?


- నరసింహమూర్తి, తొర్రూర్‌ 


డాక్టర్ సమాధానం: రొమ్ము క్యాన్సర్‌ మహిళల్లో అధికంగా వస్తుంది. కొంతమంది మగవాళ్లలోనూ రొమ్ము క్యాన్సర్‌ వచ్చినా, స్త్రీలతో పోలిస్తే వీరి సంఖ్య కేవలం ఒక శాతం మాత్రమే. జన్యు ఉత్పరివర్తనాలు; కొన్ని రకాల జన్యువులు వంశపారంపర్యంగా సంక్రమించడం; ఊబకాయం.. మొదలైన కారణాలు రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశాలను పెంచుతాయి. క్యాన్సర్‌ చికిత్సా పద్ధతి, ఆ మందుల ప్రభావాన్ని బట్టి రోగి పాటించాల్సిన ఆహారపు నియమాలు ఉంటాయి. చికిత్స ఎలాంటిదైనా ఆహారంలో తీపి పదార్థాలు తక్కువ తీసుకోవడం లేదా పూర్తిగా మానేయడం మంచిది. చక్కెర, బెల్లం, తేనె, పండ్ల రసాలను దూరంగా ఉంచాలి. తెల్ల బియ్యం, మైదా, తెల్లటి రవ్వ మొదలైన వాటికి బదులుగా ముడిధాన్యాలు, చిరు ధాన్యాలు వాడటం మంచిది. వీరికి ప్రొటీన్‌ అధికంగా అవసరమవుతుంది. కాబట్టి మాంసాహారులైతే చేపలు, చికెన్‌, గుడ్లు మొదలైనవి రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. శాకాహారులు పప్పులు, గింజలు, సోయా పనీర్‌, మీల్‌ మేకర్‌, పాలు, పనీర్‌ లాంటి వాటి నుండి ప్రొటీన్‌ పొందవచ్చు. పోషకాహార నిపుణుల సలహాను బట్టి ప్రొటీన్లు, విటమిన్ల కోసం సప్లిమెంట్లు వాడాల్సిన అవసరం ఉంటుంది. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)


Updated Date - 2022-06-04T19:34:27+05:30 IST