Advertisement
Advertisement
Abn logo
Advertisement

పరీక్షల సమయంలో ఇవి తింటే..

బాదం భేష్‌!

పరీక్షల సమయంలో శక్తినిచ్చి, అలసటకు లోను చేయని ఆహారం తీసుకోవాలి. చటుక్కున తినగలిగే స్నాక్స్‌లో బాదం భేషైనది!

పరీక్షల సమయంలో పలువురు సెలబ్రిటీలు ఎంచుకున్న పవర్‌ఫుల్‌ స్నాక్‌ బాదం. తమ బాల్యంలో, పరీక్షల సమయంలో బాదం పప్పు తినేవాళ్లమని బాలీవుడ్‌ నటులు సోహా అలీ ఖాన్‌, మిలింద్‌ సోమన్‌లు చెప్పారు. వాళ్లు ఏమన్నారంటే.... 


సోహా అలీ ఖాన్‌: పరీక్షల సమయంలో పిల్లలు ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఈ అనుభవం నేనూ ఎదుర్కొన్నాను. నా చిన్నతనంలో అమ్మ నా స్టడీ టేబుల్‌ మీద బాదం అందుబాటులో ఉంచేది. ఎక్కువ సమయం పాటు చదువుతూ, ఆకలి అనిపించినప్పుడు శక్తి కోసం బాదం బాగా ఉపయోగపడేవి. 


మిలింద్‌ సోమన్‌: పరీక్షల సమయంలో పిల్లలు ఫిట్‌నె్‌సను నిర్లక్ష్యం చేస్తారు. అయితే ఇందుకోసం స్టడీ టైమ్‌ నుంచి కొంత బ్రేక్‌ తీసుకోవాలి. ప్రత్యేకంగా వ్యాయామం కోసం సమయం కేటాయించలేకపోతే, నడుస్తూ చదవడం లేదా ఇంటిని చుట్టి రావడం చేయాలి. అలాగే బలవర్ధకమైన ఆహారంలో భాగంగా బాదం తప్పక తీసుకోవాలి. 


మెదడుకు పోషణ!

పరీక్షల సమయంలో భోజనానికీ, భోజనానికీ మధ్య ఆకలి వేయడం సహజం. ఇలాంటప్పుడు పిల్లలు చిరుతిళ్ల జోలికి వెళ్లకుండా బాదం తినడం మేలు. బాదం తింటే మెదడుకు పోషణ లభించి చురుగ్గా పని చేస్తుంది. కాబట్టి పరీక్షా సమయంలో బాదం పప్పును స్నాక్‌గా తీసుకోవాలి.

-  షీలా కృష్ణస్వామి

న్యూట్రిషన్‌ అండ్‌ వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

Advertisement

పిల్లల సంరక్షణమరిన్ని...

Advertisement