Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎలాంటి అరటిపండు తినాలంటే!

ఆంధ్రజ్యోతి(08-04-2021)

సత్వర శక్తిని ఇవ్వడమే కాదు ఆకలిని వెంటనే తగ్గిస్తుంది అరటిపండు. ఎక్కువగా బాగా మగ్గిన అరటిపండునే ఇష్టంగా తింటాం. అయితే ఎలాంటి అరటిపండు తింటే ఏమేం లభిస్తాయంటే..  


మగ్గని అరటిపండులో పిండిపదార్థాలు ఎక్కువ. జీర్ణాశయంలోని బ్యాక్టీరియా వృద్ధికి తోడ్పడే ప్రిబయాటిక్స్‌ అధికంగా లభిస్తాయి. ఇది ఆకలిని త్వరగా తీరుస్తుంది. 

మగ్గిన అరటిపండులో పీచుపదార్థం ఎక్కవగా, చక్కెరలు తక్కుగా ఉంటాయి. తొందరగా జీర్ణం అవుతుంది. యాంటీ ఆక్సిండెంట్లు సమృద్ధిగా ఉంటాయి. 

బాగా మగ్గిన, చాక్లెట్‌ రంగు మచ్చలున్న అరటిపండు చాలా తీయగా ఉంటుంది. విటమిన్లు, లవణాలు తక్కువగా లభిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. తీపి మీదకు మనసు మళ్లినప్పుడు ఈ అరటిపండు తింటే చాలు తనివితీరుతుంది.  

Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...