ఉపాధ్యాయుల బదిలీలు జరిగేనా

ABN , First Publish Date - 2020-05-27T08:41:50+05:30 IST

జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలలకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. టీచర్ల బదిలీల కోసం సీనియారిటీ ఉన్న ఉపాధ్యాయుల ..

ఉపాధ్యాయుల బదిలీలు జరిగేనా

 జిల్లాలో ఖాళీలు 920 


 ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం : జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలలకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. టీచర్ల బదిలీల కోసం సీనియారిటీ ఉన్న ఉపాధ్యాయుల వివరాలను సేకరించారు. 5 నుంచి  8  సంవత్సరాలుగా ఒకే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సంఖ్య జిల్లాలో 1140మంది ఉన్నట్లు లెక్క తేల్చారు.


జిల్లాలోని వివిధ పాఠశాలల్లో 920 ఖాళీలున్నట్లుగా చూపారు. వివరాలను కమిషనర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌కు ఇటీవల పంపారు. 2021 జనాభాల లెక్కల ప్రక్రియ, స్థానిక సంస్థల ఎన్నికల విధులు తదితర కారణాలతో ఉపాఽఽధ్యాయుల బదిలీలు జరుగుతాయా? లేదా? అనే  అంశంపై అనుమానాలు న్నాయి. సెకం డరీ గ్రేడ్‌ టీచర్లు, స్కూల్‌  అసిస్టెంటు,  పీఈటీల పోస్టులు ఖాళీ ఉన్నట్లు చూపారు. 1120 మంది  ఎస్‌జీటీలు  ఎనిమిది ఏళ్లుగా, 20 మంది హెచ్‌ఎంలు ఐదేళ్లుగా ఒకే పాఠశాలలో పనిచేస్తున్న ట్లుగా లెక్క  తేల్చారు. 

Updated Date - 2020-05-27T08:41:50+05:30 IST