ఆ మూడు పార్టీలు ఎక్కడ?: యోగి

ABN , First Publish Date - 2021-12-12T21:33:28+05:30 IST

కోవిడ్ విపత్కర సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని విపక్ష పార్టీలు ఏమయ్యాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి..

ఆ మూడు పార్టీలు ఎక్కడ?: యోగి

ఇటావా: కోవిడ్ విపత్కర సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని విపక్ష పార్టీలు ఏమయ్యాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రశ్నించారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. ఇటావాలో ఆదివారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో యోగి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మోదీ నాయకత్వంలో కరోనా మహమ్మారితో మనం ఎంతో సమర్ధవంతంగా పోరాడామని, ఆ సమయంలో కాంగ్రెస్, ఎస్‌పీ, బీఎస్‌పీ ఏమైపోయాయని నిలదీశారు. బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేస్తే బీజేపీ కచ్చితంగా 325 సీట్లు గెలుస్తుందని ఆయన అన్నారు.


కాగా, ఇదే ప్రచార సభలో పాల్గొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మరోసారి సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. ''మేము తీయటి మాటలు మాట్లాడుతుంటే, వాళ్లు జిన్నా మాటలు మాట్లాడుతున్నారు. దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. వీళ్లు సర్దార్ పటేల్‌ను జిన్నాతో పోల్చి మాట్లాడుతుంటారు. ఇది చాలా దురదృష్టకరం''అంటూ అఖిలేష్‌పై చురకలు వేశారు.

Updated Date - 2021-12-12T21:33:28+05:30 IST