ధర్మసాగరంలో నాలుగు కోట్ల విలువైన పనులు ఎక్కడ చేశారు..

ABN , First Publish Date - 2022-08-15T06:16:16+05:30 IST

ధర్మసాగరంలో రూ.నాలుగు కోట్లతో ఏ అభివృద్ధి పనులు చేశారో ఎమ్మెల్యే గణేశ్‌ చెప్పాలని నర్సీపట్నం జడ్పీటీసీ సభ్యురాలు సుకల రమణమ్మ ప్రశ్నించారు.

ధర్మసాగరంలో నాలుగు కోట్ల విలువైన పనులు ఎక్కడ చేశారు..
విలేఖరులతో మాట్లాడుతున్న నర్సీపట్నం జడ్పీటీసీ సభ్యురాలు రమణమ్మ


ఎమ్మెల్యేను ప్రశ్నించిన జడ్పీటీసీ సభ్యురాలు  

నర్సీపట్నం అర్బన్‌, ఆగస్ట్టు 14: ధర్మసాగరంలో రూ.నాలుగు కోట్లతో ఏ అభివృద్ధి పనులు చేశారో ఎమ్మెల్యే గణేశ్‌ చెప్పాలని నర్సీపట్నం జడ్పీటీసీ సభ్యురాలు సుకల రమణమ్మ ప్రశ్నించారు. ఆదివారం ధర్మసాగరంలో విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఇటీవల గడగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇక్కడకు వచ్చిన ఎమ్మెల్యే గణేష్‌ నాలుగు కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని ప్రచారం చేశారన్నారు. ధర్మసాగరంలో రూ.22.2లక్షలతో నాలుగు సీసీరోడ్లు,  రూ.25 లక్షలతో సచివాలయం, రూ.21.8లక్షలతో రైతుల భరోసా కేంద్రం, రూ.17.5లక్షలతో ఆరోగ్య కేంద్రం, నాడు-నేడు పథకంలో పాఠశాలలో రూ. 21.6 లక్షలతో పనులు చేశారన్నారు. అలాగే రెండు పాఠశాల అదనపు తరగతి భవనాలకు రూ.23 లక్షలు మంజూరయ్యాయని, ఇంకా పనులు ప్రారంభం కాలేదన్నారు.   రూ.50.3 లక్షలలో ఇంటింటికి కొళాయిలు వేశారన్నారు.  మరి నాలుగు కోట్ల రూపాయలతో ఏఏ అభివృద్ధి పనులు చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మొత్తం మీద రూ. కోటిన్నర పనులు మాత్రమే చేశారని, నాలుగు కోట్ల రూపాయలతో పనులు చేశామని గొప్పలు చెబుతున్నారని విమర్శించారు. ఈ విలేఖర్ల సమావేశంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-15T06:16:16+05:30 IST