మన లక్ష రూపాయలు.. అక్కడ రూ.కోటితో సమానం.. ఈ దేశాల్లో మన రూపాయే గొప్ప..!

ABN , First Publish Date - 2021-06-19T01:06:52+05:30 IST

దేశీ పర్యటనలకు వెళ్లాలనుకుంటే ఆ దేశాలు మీకు తక్కువ ఖర్చులోనే విలాసవంతమైన సౌకర్యాలు అందిస్తాయి.

మన లక్ష రూపాయలు.. అక్కడ రూ.కోటితో సమానం.. ఈ దేశాల్లో మన రూపాయే గొప్ప..!

కరోనా మహమ్మారి కారణంగా పర్యాటక రంగం తీవ్రంగా కుదేలైపోయింది. లాక్‌డౌన్ల కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఆర్థికంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో విదేశీ పర్యటన అనే ఆలోచనే భయం కలిగిస్తుంది. అయితే కొన్ని దేశాల్లో రూపాయికి విలువ ఉన్న కారణంగా అక్కడ పర్యటన చాలా తక్కువ ఖర్చుతోనే పూర్తయిపోతుంది. ఆయా దేశాలకు వెళ్తే ఒక్కసారిగా మీరు ధనికులైపోయారనే భావన కలుగుతుంది. కరోనా తర్వాత విదేశీ పర్యటనలకు వెళ్లాలనుకుంటే ఆ దేశాలు మీకు తక్కువ ఖర్చులోనే విలాసవంతమైన సౌకర్యాలు అందిస్తాయి. అవేంటో చూద్దాం..


ప్రకృతి రమణీయతతో పర్యాటకులను అబ్బురపరిచే దేశాల్లో వియత్నాం ఒకటి. ఈ దేశంలో భారతీయ రూపాయి 310.46 వియత్నమీస్ డాంగ్‌లతో సమానం. అంటే మీ లక్ష రూపాయలు అక్కడ దాదాపు 3 కోట్ల వియత్నమీస్ డాంగ్‌లతో సమానం. ఈ డబ్బుతో వియత్నాంలో మీ పర్యటన ఏ విధంగా ఉంటుందో ఒక్క సారి ఊహించుకోండి.


ఇరాన్


మధ్యప్రాశ్చ్యంలోని ఇరాన్ పురాతన భౌగోళిక ప్రాంతం. అక్కడ ఎన్నో చారిత్రక కట్టడాలున్నాయి. అక్కడ ఒక్క రూపాయి 569.43 ఇరానియన్ రియాల్స్‌కు సమానం. అక్కడకు మీరు ఓ లక్ష రూపాయలతో వెళితే.. మీ జేబులో 5.6 కోట్ల ఇరానియన్ రియాల్స్‌ ఉన్నట్టే. ఆ డబ్బుతో అక్కడ రాయల్‌గా ఎంజాయ్ చేయవచ్చు.


 వియత్నాం


ఇండోనేషియా


సుందర సముద్ర తీరాలు, ప్రాచీన దేవాలయాలతో ఇండోనేషియా పర్యటన ఓ ఆహ్లాదకర అనుభవాన్ని మిగులుస్తుంది. ముఖ్యంగా అక్కడి బాలి ద్వీపానికి చాలా మంది భారతీయులు వెళుతుంటారు. అక్కడ 1 రూపాయి 195.09 ఇండొనేషియన్ రూపాయిలతో సమానం. అంటే మీరు లక్ష రూపాయలతో అక్కడకు వెళితే మీ దగ్గర 2 కోట్ల ఇండోనేషియన్ రూపాయిలున్నట్టే. కాబట్టి భారతీయ పర్యాటకులకు ఇండోనేషియాలో లగ్జరీ తక్కువ ధరలోనే లభిస్తుంది.


 గునియా


పశ్చిమాఫ్రికాలోని పర్యాటక ప్రాంతాల్లో ప్రముఖమైనది గునియా. ముఖ్యంగా సాహస యాత్రికులకు అది స్వర్గధామం. మీరు ఒక లక్ష రూపాయలు అక్కడకు తీసుకెళితే మీరు 1.3 కోట్ల గునియన్ ఫ్రాంక్‌లకు అధిపతి అయినట్టే.


పరాగ్వే


బ్రెజిల్, అర్జెంటీనా, చిలీ మధ్య ఉన్న చిన్న దేశం పరాగ్వే కూడా ప్రముఖ టూరిస్ట్ స్పాట్‌లలో ఒకటి. జలపాతాలకు, ప్రకృతి దృశ్యాలకు పరాగ్వే నెలవు. మన లక్ష రూపాయల అక్కడ 90 లక్షల పరాగ్వేనియన్ గౌరానీలతో సమానం.


 కంబోడియా



అద్భుతమైన ప్రాచీన శిల్ప కళకు నిలయమైన కంబోడియా పర్యటనను భారతీయులు చాలా తక్కువ ఖర్చుతో పూర్తి చేయవచ్చు. ఇక్కడ 1 రూపాయి 55.73 కంబోడియన్ రీల్స్‌తో సమానం. మన దేశంలోని ప్రముఖ ప్రదేశాలకు వెళ్లేందుకు అయ్యే ఖర్చులో సగం పెట్టినా కంబోడియా పర్యటన విలాసవంతంగా పూర్తి చేయవచ్చు.

Updated Date - 2021-06-19T01:06:52+05:30 IST