నీరు–చెట్టు నిధులేవీ..?

ABN , First Publish Date - 2021-07-24T06:05:43+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం నీరు–చెట్టు పథకానికి మంగళం పాడింది.

నీరు–చెట్టు నిధులేవీ..?

పథకం నిలిపివేసిన ప్రభుత్వం

టీడీపీ హయాంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించని వైనం

పెండింగ్‌లో రెండేళ్ల బిల్లులు 

విజిలెన్స్‌ తనిఖీలతో కొర్రీలు

అప్పులపాలైన కాంట్రాక్టర్లు

(తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ప్రభుత్వం నీరు–చెట్టు పథకానికి మంగళం పాడింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు బిల్లులు మంజూరు చేయకుండా కొర్రీలు పె డుతోంది. ఇటీవల విజిలెన్స్‌ తనిఖీల పేరుతో బిల్లుల్లో కోత విధించారు. మిగిలిన బిల్లులైనా ఇస్తారన్న నమ్మకం సన్నగిల్లుతోంది. జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో బిల్లులపై హైకోర్టు జోక్యం చేసుకోవడంతో ఆశలు చిగురించాయి. కొందరు కాంట్రాక్టర్‌లు, మాజీ ప్రతినిధులు ఉపాధి పనుల బకాయిలపై హైకోర్టును ఆశ్రయించారు. బిల్లులు చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వానికి గడువు విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ నీరు–చెట్టు పథకంలో బకాయిలపై అధికారులు మౌ నం దాల్చారు. ఏళ్లు గడుస్తున్నాసరే పెదవి విప్పడం లేదు.  బకాయిలు రాకపోవడంతో కాంట్రాక్టర్‌లు అప్పు లపాలయ్యారు. భూములు అమ్ముకుంటున్నారు. కేవ లం తెలుగుదేశం సానుభూతి పరులు నీరు– చెట్టులో పనులు నిర్వహించారన్న నెపంతో ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయడం లేదన్న వాదన బలంగా నాటుకుపోయింది. పల్లెల అభివృద్ధిపై దీనిప్రభావం తీవ్రంగా పడింది. కొత్తగా పనులు నిర్వహించేందుకు కాంట్రాక్టర్‌లు ముందుకు రావడం లేదు.

 నీరు–చెట్టు తీరిది..  

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2016 నుంచి నీరు–చెట్టు పథకం ప్రారంభించారు. నామినేషన్‌ పద్ధతిలో పనులు నిర్వహించారు. మైనర్‌ ఇరిగేషన్‌ శాఖ ఆధ్వర్యంలో పెద్దఎత్తున చెరువు తవ్వకాలు చేపట్టారు.జిల్లాలో ఉన్న దాదాపు 1,465 మైనర్‌ ఇరిగేష న్‌ చెరువుల్లో పూడికతీత పనులు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వమే తొలినుంచీ బిల్లులు మంజూరు చేస్తూ వచ్చింది. మంచినీటి చెరువుల్లోనూ పూడిక తీయిం చారు.  ఇలా కోట్ల రూపాయల విలువైన పనులు పూ ర్తి చేశారు. నీరు–చెట్టు పథ కంలో భాగంగా చెరువులో పూడిక తీసిన మట్టిని క మ్యూనిటీ హాళ్ల స్థలాలు, శ్మశాన వాటిక స్థలాలు, పం చాయతీ, ఇళ్ల స్థలాల మెర కకోసం వినియోగించారు.  నీరు–చెట్టు పథకం ద్వారా జిల్లాలో  3199 పనులను రూ.381.13 కోట్లతో పూర్తి చేశారు. 2016–17లో నిర్వ హించిన పనులకు సంబంఽ దించి రూ.136 కోట్లు అప్పట్లోనే చెల్లించారు. ఆ తర్వాత రెండేళ్లలో నిర్వహిం చిన పనులకు పూర్తిస్థా యిలో బిల్లులు చెల్లించలేదు.  మొత్తంపైన 2017 నుం చి 2019 మధ్యలో  దాదాపు రూ. 244 కోట్ల విలువైన పనులు నిర్వహించారు. ఇందులో రూ.140 కోట్లు చెల్లించారు. మిగిలిన రూ. 104 కోట్లు ఇప్పటికీ చెల్లించలేదు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీరు–చెట్టు పథకం నిలచిపోయింది. బిల్లులు కూడా చెల్లించకపోవ డంతో కాంట్రాక్టర్‌లు లబోదిబోమంటున్నారు.

పల్లెల్లో కుంటుపడ్డ అభివృద్ధి

ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో పల్లెల్లో ప్రగతి కుంటుపడిపోయింది. అభివృద్ధి పనులు నిలిచి పోయాయి. ఆర్థిక సంఘం నిధులు వెచ్చించేందుకు పంచాయతీలు చొరవ చూపుతున్నా పనులు సాగే పరిస్థితి లేదు. ప్రభుత్వం బిల్లులు చెల్లించదనే ముద్ర కాంట్రాక్టర్లలో బలంగా నాటుకుపోయింది. ఆర్థిక సంఘం నిధులను కేవలం విద్యుత్‌ బిల్లులు చెల్లించేం దుకు మాత్రమే వినియో గిస్తున్నారు. జిల్లాకు 15వ ఆర్థిక సంఘం తొలి త్రైమాసికంలో రూ.39 కోట్లు నిధులు విడుదలయ్యాయి. మరోవైపు 14వ ఆర్థిక సంఘం నిధులను ఖర్చు పెట్టుకోవడానికి ఏడాది గడువు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయినా పనులు నిర్వహించే పరిస్థితి లేదు. 


Updated Date - 2021-07-24T06:05:43+05:30 IST