భౌతికదూరం ఎక్కడ?

ABN , First Publish Date - 2021-06-15T05:38:02+05:30 IST

ప్రజలందరు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచార సాధనాలు, మీడియాద్వారా తెలియజేస్తున్నా ప్రజలు పట్టించుకోవడం లేదు.

భౌతికదూరం ఎక్కడ?
పద్మనాయక కల్యాణ మండపం వ్యాక్సినేషన్‌ సెంటర్‌లో టీకా వేసుకునేందుకు రిజిస్ర్టేషన్‌ చేసుకుంటున్న నగరవాసులు

సుభాష్‌నగర్‌, జూన్‌ 14: ప్రజలందరు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచార సాధనాలు, మీడియాద్వారా  తెలియజేస్తున్నా ప్రజలు పట్టించుకోవడం లేదు. కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్ర ప్రభావాన్ని చూపినా కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ, మున్సిపల్‌ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్‌ సూపర్‌ స్ర్పైడర్లకు వ్యాక్సినేషన్‌ చేపట్టారు. ఇందులో భాగంగా  ఎస్సారార్‌ కళాశాల, వైశ్యభవన్‌తోపాటు బాలాజీ ఫంక్షన్‌హాల్‌లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రద్దీ ఎక్కువ కావడంతో బాలాజీ ఫంక్షన్‌హాల్‌లోని కేంద్రాన్ని పద్మనాయక కల్యాణ మండపానికి మార్చారు. ఈ కేంద్రంలో సోమవారం వ్యాక్సినేషన్‌కు చివరి రోజు కావడంతో అధిక సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. వచ్చిన వారెవరూ భౌతిక దూరం పాటించడం లేదు. తాము ఎంత చెప్పినప్పటికి ఎవరూ వినిపించుకోలేదని అక్కడి సిబ్బంది తెలిపారు.

Updated Date - 2021-06-15T05:38:02+05:30 IST