డబ్బు ఎక్కడ దాచావు?

ABN , First Publish Date - 2022-06-20T08:20:23+05:30 IST

తెనాలి రామకృష్ణ ఒకరోజు పొరుగూరుకి బయలుదేరాడు. దారిలో ఓ అపరిచితుడు కనిపించి నేనూ అటే వెళుతున్నాను అంటూ మాటలు కలిపాడు. అతడు దొంగ అని రామకృష్ణ పసిగట్టాడు.

డబ్బు ఎక్కడ దాచావు?

తెనాలి రామకృష్ణ ఒకరోజు పొరుగూరుకి బయలుదేరాడు. దారిలో ఓ అపరిచితుడు కనిపించి నేనూ అటే వెళుతున్నాను అంటూ మాటలు కలిపాడు. అతడు దొంగ అని రామకృష్ణ పసిగట్టాడు. ఇద్దరూ కలిసి ప్రయాణం సాగించారు. చీకటి పడటంతో ఒక చోట విశ్రాంతి కోసం ఆగారు. నడక వల్ల బాగా అలసిపోయిన రామకృష్ణకు వెంటనే నిద్రపట్టేసింది. ఇదే అదనుగా ఆ దొంగ రామకృష్ణ డబ్బు తస్కరించాలని చూశాడు. కానీ ఎంత వెతికినా ఏమీ దొరకలేదు. దాంతో అతడు కూడా నిద్రలోకి జారుకున్నాడు. ఉదయాన్నే మళ్లీ ఇద్దరూ నడక ప్రారంభించారు. రామకృష్ణ డబ్బు ఎక్కడ దాచాడో తెలుసుకోవాలన్న కుతూహలం ఆ దొంగకి కలిగింది. దాంతో అతడు ‘‘నేను దొంగతనానికి వెళ్లిన ప్రతిసారి ఎంతో కొంత దొరుకుతుంది. కానీ ఈసారి మాత్రం ఏమీ దొరకలేదు. డబ్బులు ఎక్కడ దాచావో నాకు అర్థం కాలేదు’’ అన్నాడు. అప్పుడు రామకృష్ణ చిన్నగా నవ్వి ‘‘నువ్వు దొంగవన్న విషయం నాకు తెలుసు. అందుకే నా డబ్బును జాగ్రత్తగా దాచుకున్నాను’’ అని అన్నాడు. ‘‘ఎక్కడ దాచావు? నేను అంతటా వెతికాను. ఎక్కడా దొరకలేదు’’ అని అడిగాడు దొంగ. ‘‘నీ దిండు కిందే దాచాను’’ అన్నాడు రామకృష్ణ. దాంతో రామకృష్ణ తెలివికి ఆశ్చర్యపోయాడు దొంగ.

Updated Date - 2022-06-20T08:20:23+05:30 IST