Advertisement
Advertisement
Abn logo
Advertisement

సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు ఎక్కడ?

హైదరాబాద్: రాష్ట్రంలో పలువురిని మోసం చేసిన కేసులో సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. శ్రీధర్ రావుపై ఇప్పటికే నార్సింగ్, రాయదుర్గం, సనత్ నగర్‌లో కేసులు నమోదయ్యాయి. మూడు పోలీస్‌స్టేషన్లలో నమోదైన కేసుల్లో శ్రీధర్ రావు తప్పించుకు తిరుగుతున్నాడు. శ్రీధర్ రావుపై సైబరాబాద్ పోలీసులు ఇప్పటికే లుకౌట్ నోటీసు జారీ చేశారు. శ్రీధర్ రావు ఆచూకీ తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు ఇప్పటికే పత్రిక ప్రకటన విడుదల చేశారు. శ్రీధరరావు సమాచారం తెలిపిన వారికి తగిన పారితోషకం ఇస్తామని పోలీసులు తెలిపారు. దేశం విడిచి ఎక్కడికి పారిపోకుండా లుకౌట్ నోటీసు జారీ చేశారు. అన్ని ఎయిర్ పోర్టులను పోలీసులు అప్రమత్తం చేశారు. బెంగళూరు, చెన్నై, ఆంధ్రప్రదేశ్‌లలో స్పెషల్ టీమ్స్‌తో గాలిస్తున్నారు. Advertisement
Advertisement