వైద్యులేరీ.. సిబ్బంది ఎక్కడ?

ABN , First Publish Date - 2022-08-11T05:37:41+05:30 IST

మెళియాపుట్టి పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు ఉన్నప్పటికీ వారు రాకపోవడం, ఎన్‌ఎంవో వైద్యం చేస్తుండడంపై డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ గణపతి రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేయగా వైద్యులు, సిబ్బంది గైర్హాజరు బయటపడింది. వైద్యులు వేర్వేరు ప్రాంతాల్లో బయోమెట్రిక్‌ వేసి విధులకు హాజరుకాక పోవడంతో అవాక్కయ్యారు.

వైద్యులేరీ.. సిబ్బంది ఎక్కడ?
రికార్డులను పరిశీలిస్తున్న డిప్యూటీ డీఎంహెచ్‌వో

డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ గణపతిరావు ఆగ్రహం
మెళియాపుట్టి, ఆగస్టు 10:
మెళియాపుట్టి పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు ఉన్నప్పటికీ వారు రాకపోవడం, ఎన్‌ఎంవో వైద్యం చేస్తుండడంపై డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ గణపతి రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేయగా వైద్యులు, సిబ్బంది గైర్హాజరు బయటపడింది. వైద్యులు వేర్వేరు ప్రాంతాల్లో బయోమెట్రిక్‌ వేసి విధులకు హాజరుకాక పోవడంతో అవాక్కయ్యారు. వైద్యుల గైర్హాజరుపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు ఆయన పేర్కొ న్నారు.  సిబ్బంది సైతం సకాలానికి హాజరు కాకపోవడంపై మండిపడ్డారు. 24 గంటలూ సిబ్బంది అందుబాటులో ఉండా లన్నారు. మరోసారి ఇలా జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా వైద్యులపై ఎన్ని ఫిర్యాదులు చేసినా వారిలో మార్పు కనిపించడం లేదని రోగులు ఆందోళన వ్యక్తంచేశారు. గతంలో ఐటీడీఏ పీవోలు శ్రీధర్‌, నవ్య తనిఖీ సమయాల్లోనూ ఇలాగే గైర్హాజరయ్యారని, వారు ఆగ్రహం వ్యక్తంచేసినా ఫలితం కనిపించడం లేదని రోగులు పేర్కొం టున్నారు. 

Updated Date - 2022-08-11T05:37:41+05:30 IST