ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. చంద్రబాబే సీఎం!

ABN , First Publish Date - 2022-05-28T07:48:17+05:30 IST

ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. చంద్రబాబే సీఎం!

ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. చంద్రబాబే సీఎం!

గెలుపు సమస్య కాదు.. 160 సీట్లతో రావాలి: అచ్చెన్న

మండువారిపాలెం రైతులకు పయ్యావుల కేశవ్‌ ధన్యవాదాలు

అమరావతి, మే 27 (ఆంధ్రజ్యోతి): ‘ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాబోయే సీఎం చంద్రబాబే. గెలుపు సమస్య కాదు. కానీ 160 సీట్లతో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం మహానాడులో ఆయన ప్రసంగించారు. ఈసారి చంద్రబాబు సీఎం కాగానే కార్యకర్తలకు చట్టబద్ధంగానే అధికారం ఇస్తామన్నారు. న్యాయబద్ధంగానే.. వారిని ఇబ్బంది పెట్టినవారి తాటతీస్తామని హెచ్చరించారు. ‘ఈ మూడేళ్లలో టీడీపీని చేయాలనే కుట్రతో జగన్‌రెడ్డి అనేక కేసులు, ఇబ్బందులు పెట్టారు. అయితే తెలుగుదేశం పార్టీ వైసీపీలా గాలికి పుట్టిన పార్టీ కాదు. తెలుగు ప్రజల గుండెల్లో నుంచి వచ్చిన పార్టీ. మీ తాత, తండ్రి ఏమీ చేయలేకపోయారు. నువ్వు కూడా ఏం చేయలేవు జగన్‌రెడ్డీ. పార్టీ నాయకులు, కార్యకర్తలు అనేకమందిపై రౌడీషీట్లు తెరిచారు. చంద్రబాబు సీఎం కాగానే ఒక్క సంతకంతో ఆ రౌడీషీట్లు ఎత్తేస్తాం. గడపగడపకు ప్రభుత్వంలో జనం నిలదీస్తుండడంతో బస్సుయాత్రతో మంత్రులు బయల్దేరుతున్నారు. ఆ వచ్చేది మంత్రులు కాదు. ఆలీబాబా..40 దొంగలు’ అని ధ్వజమెత్తారు. మహానాడుకు ప్రభుత్వం అనేక ఆటంకాలు కల్పించిందని పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు. ఈ క్రమంలో మండువారిపాలెం రైతులు ముందుకొచ్చి.. తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసేందుకు మేమున్నాం.. మహనాడు నిర్వహించుకునేందుకు మా భూములిస్తామని నిలబడ్డారని ధన్యవాదాలు తెలిపారు. 


Updated Date - 2022-05-28T07:48:17+05:30 IST