పంజాబ్ సీఎం వ్యాఖ్యలపై సీఎం కేజ్రీవాల్ కౌంటర్

ABN , First Publish Date - 2021-10-07T00:47:44+05:30 IST

పంజాబ్ సీఎం వ్యాఖ్యలపై సీఎం కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ కామెంట్స్ చేశారు.

పంజాబ్ సీఎం వ్యాఖ్యలపై సీఎం కేజ్రీవాల్ కౌంటర్

న్యూఢిల్లీ: పంజాబ్ సీఎం వ్యాఖ్యలపై సీఎం కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ కామెంట్స్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్ మంచి దుస్తులు ధరించాలని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చాన్నీ కామెంట్స్ చేశారు. పంజాబ్ సీఎం వ్యాఖ్యలపై సీఎం కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. ఎన్నికల వాగ్దానాల గురించి ఆలోచించాలని చన్నీకి కేజ్రీవాల్ సూచించారు."బట్టల అంశాన్ని వదలండి, అని.. మీరు ఎన్నికల హామీలను ఎప్పుడు నెరవేరుస్తారో చెప్పండి?" అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. "మీకు తన బట్టలు నచ్చకపోయినా ఫర్వాలేదని, పబ్లిక్ వాటిని ఇష్టపడతారని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

Updated Date - 2021-10-07T00:47:44+05:30 IST