టిడ్కో ఇళ్లు ఎప్పుడిస్తారు?

ABN , First Publish Date - 2022-05-17T05:22:30+05:30 IST

జీవీఎంసీ పరిధిలో టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఎప్పుడు ఇస్తారనేది స్పష్టం చేయాలని టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ పీలా శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు.

టిడ్కో ఇళ్లు ఎప్పుడిస్తారు?
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న పీలా శ్రీనివాస్‌

టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ పీలా శ్రీనివాస్‌

విశాఖపట్నం, మే 16 (ఆంధ్రజ్యోతి): జీవీఎంసీ పరిధిలో టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఎప్పుడు ఇస్తారనేది స్పష్టం చేయాలని టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ పీలా శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. జీవీఎంసీలోని తన చాంబర్‌లో సోమవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ హయాంలో లబ్ధిదారులకు ఇళ్లను కేటాయిస్తే తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ కేటాయింపులను రద్దుచేసి, ఇప్పటికీ వాటిని అందజేయకపోవడం దారుణమన్నారు. గతంలో ఇళ్ల కోసం లక్ష చొప్పున డబ్బులు చెల్లించిన వారిని కాకుండా వారి పేర్లకు బదులు వేరొకరి పేర్లను మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.


గతంలో ఇళ్ల కోసం డీడీలు కట్టినవారికి తక్షణం ఇళ్లను అందజేయాలని, లేనిపక్షంలో వారి డబ్బుని వడ్డీతో సహా వెనక్కి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఇంటిపన్ను భారీగా వసూలు చేశామని సంబరాలు చేసుకున్న జీవీఎంసీ మేయర్‌, కమిషనర్‌కు నగర అభివృద్ధిపై ఆ శ్రద్ధ ఎందుకు లేదని ప్రశ్నించారు. ప్రతి వార్డుకు నిధులు ఇస్తున్నట్టు గొప్పగా చెప్పి, ఒక ్కపైసా కూడా విడుదల చేయలేదని విమర్శించారు.


ఏడాది పూర్తయినా వార్డులో ఏమీ చేయలేకపోయామనే ఆవేదన అన్ని పార్టీల కార్పొరేటర్లలోనూ ఉందన్నారు. త ్వరలో జరిగే కౌన్సిల్‌ సమావేశంలో దీనిపై ప్రశ్నిస్తామన్నారు. ఈ సమావేశంలో 56వ వార్డు కార్పొరేటర్‌ శరగడం రాజశేఖర్‌, 89వ వార్డు కార్పొరేటర్‌ దాడి రమేష్‌, 98వ వార్డు కార్పొరేటర్‌ పి.వి.నరసింహం పాల్గొన్నారు.

Updated Date - 2022-05-17T05:22:30+05:30 IST