రాష్ట్ర బకాయిలను ఎప్పుడిస్తారు?

ABN , First Publish Date - 2022-05-15T08:51:47+05:30 IST

కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిల సొమ్మును ఎప్పుడు చెల్లిస్తారని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాను టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.

రాష్ట్ర బకాయిలను ఎప్పుడిస్తారు?

అమిత్‌ షాను ట్విటర్‌లో ప్రశ్నించిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌, మే 14 (ఆంధ్రజ్యోతి): కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిల సొమ్మును ఎప్పుడు చెల్లిస్తారని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాను టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. అమిత్‌ షా పర్యటన సందర్భంగా ఆమె ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఫైనాన్స్‌ కమిషన్‌ గ్రాంట్ల కింద రూ.3,000 కోట్లు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి గ్రాంట్ల కింద రూ.1,350 కోట్లు, జీఎస్టీ పరిహారం కింద రూ.2,247 కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉందని, వీటిని ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టతనివ్వాలన్నారు. ఎనిమిదేళ్లుగా రాష్ట్రానికి ఒక్క ఐఐటీ, ఐఐఎం, ఐఐఎ్‌సఈఆర్‌, ఎన్‌ఐడీ, మెడికల్‌ కాలేజీ అయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు. నవోదయ పాఠశాలలు ఇవ్వడంలో కేంద్రం ఎందుకు విఫలమైందో తెలంగాణ బిడ్డలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కర్ణాటకలోని ఎగువ భద్ర నీటిపారుదల ప్రాజెక్టుకు, కెన్‌బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి, పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులను నిరాకరించడం కేంద్రప్రభుత్వం కపటత్వం కాదా? అని ఆమె ప్రశ్నించారు.

Updated Date - 2022-05-15T08:51:47+05:30 IST