Abn logo
Jul 31 2021 @ 14:16PM

ఫోన్ లిఫ్ట్ చేయని కూతురు.. అనుమానంతో బంధువుకు చెప్పిన తల్లి.. ఆయన ఆ ఇంటికి వెళ్లి చూస్తే..

బీహార్‌లోని పాట్నాకు చెందిన దివ్య అనే మహిళ ఢిల్లీలో మ్యూజిక్ టీచర్‌గా పనిచేస్తోంది.. ఢిల్లీలోనే ఓ ఫ్లాట్‌లో ఒంటరిగా నివాసం ఉంటోంది.. ఆమె తల్లిదండ్రులు పాట్నాలో నివసిస్తున్నారు.. గత ఐదు రోజులుగా దివ్య.. తల్లి ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయడం లేదు.. దీంతో ఆమె సమీపంలోనే ఉండే బంధువుకు ఫోన్ చేసి దివ్య ఫ్లాట్‌కు వెళ్లమని అడిగింది.. ఆయన దివ్య ఫ్లాట్‌కు వెళ్లి చూడగా తాళం వేసి ఉంది.. లోపలి నుంచి తీవ్ర దుర్గంధం వస్తోంది.. అనుమానం వచ్చిన ఆయన పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు.


తలుపులు బద్దలుగొట్టి లోపలికి ప్రవేశించిన పోలీసులు కుళ్లిన స్థితిలో ఉన్న రెండు మృతదేహాలను కొనుగొన్నారు. అందులో ఒకరిని నవీన్‌గా, మరొకరిని దివ్యగా గుర్తించారు. వీరిద్దరూ ఐదు రోజుల క్రితమే చనిపోయి ఉంటారని నిర్ధారణకు వచ్చారు. నవీన్ చేతికి కరెంట్ వైర్ చుట్టేసి ఉంది. దాని గుండా విద్యుత్ ప్రవహిస్తోంది. దివ్య చేయి, నవీన్‌ శరీరానికి అతుక్కొని ఉంది. దివ్యకు, నవీన్‌కు సంవత్సరంన్నర కాలంగా పరిచయం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరినీ ఎవరైనా హత్య చేశారా? లేక ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారా? లేక ప్రమాదమా? అని పోలీసులు పరిశోధిస్తున్నారు.

ప్రత్యేకంమరిన్ని...