Advertisement
Advertisement
Abn logo
Advertisement

అక్కాచెల్లెళ్ల మధ్య చిన్న గొడవ.. అలిగి లోపలికి వెళ్లిపోయిన సోదరి.. కొద్ది సేపటి తర్వాత ఏం జరిగిందంటే..

ఆ యువతులిద్దరూ అక్కాచెల్లెళ్లు.. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయారు.. అప్పట్నుంచి ఆ ఇద్దరే ఒకరికొకరు తోడుగా జీవనం సాగిస్తున్నారు.. బాధ్యతలన్నీ తను తీసుకుని చెల్లిని అక్క చదివిస్తోంది.. ఈ క్రమంలో ఏదో చిన్న విషయంలో చెల్లిని అక్క మందలించింది.. దీంతో అలిగిన చెల్లి తన గదిలోకి వెళ్లి తలుపేసుకుంది.. కొద్దిసేపటికి అక్క వెళ్లి చూడగా ఆమె ఉరేసుకుని ఉంది.. ఛత్తీస్‌గడ్‌లోని భిలాయ్‌లో ఈ ఘటన జరిగింది. 


బిలాయ్‌కు చెందిన జానకి అనే యువతి ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతోంది. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోవడంతో జానకి బాధ్యతను ఆమె ఆక్క తీసుకుంది. ఆమె పనిచేస్తూ జానకిని చదివిస్తోంది. సోమవారం సాయంత్రం వీరిద్దరి మధ్య ఏదో విషయమై చిన్న గొడవ జరిగింది. జానకిని ఆమె అక్క మందలించింది. దీంతో అలిగిన జానకి తన గదిలోకి వెళ్లి తలుపేసుకుంది. 


భోజన సమయంలో జానకిని పిలవడానికని వెళ్లిన ఆమె అక్క కిటికీలో నుంచి కనిపించిన దృశ్యాన్ని చూసి షాకైంది. లోపల జానకి చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు జానకి మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement