ఈ తాగుబోతు ఏంటి.. ఏటీఎం మెషీన్‌తో మాట్లాడుతున్నాడు.. అని డోర్ తీసి లోపలికి వెళ్లిన వాళ్లకు షాకింగ్ సీన్..

ABN , First Publish Date - 2021-12-30T20:15:41+05:30 IST

అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పోలీసులకు ఏటీఎం సెక్యూరిటీ సిబ్బంది నుంచి ఫోన్ వచ్చింది..

ఈ తాగుబోతు ఏంటి.. ఏటీఎం మెషీన్‌తో మాట్లాడుతున్నాడు.. అని డోర్ తీసి లోపలికి వెళ్లిన వాళ్లకు షాకింగ్ సీన్..

అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పోలీసులకు ఏటీఎం సెక్యూరిటీ సిబ్బంది నుంచి ఫోన్ వచ్చింది.. స్థానిక ఏటీఎం సెంటర్‌‌లో చోరీకి ప్రయత్నం జరుగుతోందని సమాచారం వచ్చింది.. వెంటనే అక్కడకు వెళ్లిన పోలీసులకు షాకింగ్ సీన్ కనిపించింది. లోపల ఓ తాగుబోతు వ్యక్తి ఏటీఎం మెషీన్‌తో మాట్లాడుతున్నాడు.. దగ్గరకు వెళ్లి చూస్తే అసలు విషయం బోధపడింది. ఏటీఎం మెషిన్‌ ద్వారా ఆ తాగుబోతు వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాయ్‌లో ఈ ఘటన జరిగింది.


బిలాయ్‌లో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం సెంటర్లోకి బుధవారం అర్ధరాత్రి ఓ తాగుబోతు ప్రవేశించి ట్యాంపరింగ్ చేసేందుకు ప్రయత్నించాడు. వెంటనే ఆ మెషిన్ నుంచి సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం వెళ్లింది. వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అంతేకాకుండా మెషిన్‌కు అమర్చిన స్క్రీన్ ద్వారా ఆ తాగుబోతుకు వీడియో కాల్ చేశారు. పోలీసులు వచ్చే వరకు అతను ఎక్కడకూ వెళ్లిపోకుండా మాటల్లో పెట్టారు. అతను మాట్లాడుతూ ఉండగానే స్థానిక పోలీసులు అక్కడకు వెళ్లారు. 


ఏటీఎం సెంటర్లోకి ప్రవేశించిన వెంటనే ఆ వ్యక్తి ఎవరితో మాట్లాడుతున్నాడో పోలీసులకు అర్థం కాలేదు. దగ్గరకు వెళ్లి చూస్తే స్క్రీన్‌లో సెక్యూరిటీ ఆఫీసర్ కనిపించాడు. మొత్తం అంతా తనిఖీ చేసి లూటీ జరగలేదని పోలీసులు సెక్యూరిటీ సిబ్బందికి చెప్పారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.   

Updated Date - 2021-12-30T20:15:41+05:30 IST