Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 16 Aug 2022 00:36:35 IST

అరటిపండు ఎప్పుడు?

twitter-iconwatsapp-iconfb-icon
అరటిపండు ఎప్పుడు?

అరటిపండు ఆరోగ్యకరం. అయితే తినే సమయం, పండిన తీవ్రతలను బట్టి పండులోని పోషకాలతో పాటు శరీరానికి అందే పోషకాలలో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటూ ఉంటాయి. కాబట్టి పోషకాల అవసరాన్ని బట్టి అరటిపండును తినడం ఆరోగ్యకరం!


పక్వానికి వచ్చిన అరటిపండు కంటే బాగా మగ్గిన అరటిపండు తీపి ఎక్కువ. ఇందుకు కారణం దోరగా పండిన అరటిపండులో స్టార్చ్‌ పూర్తి సింపుల్‌ షుగర్స్‌గా విడిపోవు. అదే బాగా మగ్గిన పండులో స్టార్చ్‌ షుగర్స్‌గా విడిపోయి ఉంటుంది. కాబట్టి బాగా మగ్గిన అరటిపండు ఎక్కువ తియ్యగా ఉంటుంది. 


మగ్గిన పండు ఎప్పుడు: తోలు మీద నల్ల మచ్చలు ఏర్పడితే ఆ అరటిపండు బాగా మగ్గిందని అర్ధం. ఈ పండు తేలికగా జీర్ణం అవుతుంది. వ్యాయామానికి ముందు లేదా తర్వాత తక్షణ శక్తి పొందాలంటే ఇలా మగ్గిన అరటిపండు తినాలి.


నిద్ర కోసం: అరటిపండులో మన శరీరంలో స్వతహాగా తయారుకాని ట్రిప్టోఫాన్‌ అనే అమీనో యాసిడ్‌ ఉంటుంది. ఈ అమీనో యాసిడ్‌ నిద్రను క్రమబద్ధీకరించే సెరటోనిన్‌ అనే న్యూరోట్రాన్స్‌మీటర్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది. సెరటోనిన్‌ మెదడులో ఉత్పత్తయ్యే అత్యంత ముఖ్యమైన రసాయనం. ఇది ఒత్తిడి, కుంగుబాటులను తగ్గించి నిద్రలేమిని పోగొడుతుంది.


పరగడుపున వద్దు: ఈ పండులో మెగ్నీషియం, పొటాషియం, పీచు మొదలైన పోషకాలు ఉన్నా, పరగడుపున ఈ పండును తినడం శ్రేయస్కరం కాదు. దీన్లో ఉండే అత్యధిక చక్కెరలు తక్షణ శక్తిని అందించినా, అంతే వేగంగా కొన్ని గంటల వ్యవధిలోనే అలసటకూ గురిచేస్తాయి. ఆమ్లతత్వం కలిగిన అరటిపళ్లు పరగడుపున తింటే జీర్ణసంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఒకవేళ పరగడుపున అరటిపండు తినే అలవాటు ఉంటే, ఆ పళ్లను ఇతర పదార్థాలతో కలిపి తినాలి.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

ఓపెన్ హార్ట్Latest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.