Oct 25 2021 @ 15:17PM

నీ పేరును గౌరీ నుంచి ఆయేషాగా మార్చుకో.. బుర్ఖా ధరించు.. అని Shah Rukh Khan తన భార్యకు చెప్పినప్పుడు..

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్, ఆయన భార్య గౌరీ ఖాన్ ప్రస్తుతం తీవ్ర విషాదంలో ఉన్నారు. వారి పెద్ద కొడుకు ఆర్యన్ డ్రగ్స్ కేసులో అరెస్టై ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నాడు. ఆర్యన్‌ను బెయిల్‌పై బయటకు తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. ఈ రోజు షారూక్, గౌరి 30వ వివాహ వార్షికోత్సవం. ఆరేళ్ల ప్రేమ తర్వాత 1991 ఆక్టోబర్ 25న షారూక్, గౌరి హిందూ సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. తన వెడ్డింగ్ రిసెప్షన్‌ సందర్భంగా జరిగిన ఓ ఫన్నీ సంఘటనను షారూక్ గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. `చాలా పాత కాల పద్ధతుల్లో జరిగిన ఆ వివాహ రిసెప్షన్ వేడుకలో నేను, గౌరి పక్కపక్కన కూర్చున్నాం. 


అక్కడకు వచ్చిన వారందరూ నన్ను వింతగా చూసేవారు. ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకుంది. అతడు అమ్మాయి పేరు మారుస్తాడా? మతం మార్చుకోమంటాడా? అని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు నేను `గౌరి బుర్ఖా వేసుకో. నమాజ్ చేద్దాం`అని చెప్పా. దాంతో వారందరూ షాకయ్యారు. అప్పటికే నేను గౌరి మతం మార్చేశానని అనుకున్నారు. అప్పుడు నేను వాళ్లతో.. `ఇక నుంచి ఈమె పేరు ఆయేషా. ఇకపై ఎప్పుడూ బుర్ఖా వేసుకునే ఉండాలి. ఇంటి నుంచి ఎప్పుడూ బయటకు రాకూడదు` అని చెప్పాను. దాంతో వారంతా షాకయ్యారు. ఆ తర్వాత నేను సరదాగా అన్నానని గ్రహించి నవ్వుకున్నారు. ఏదేమైనా నా పెళ్లి అద్భుతంగా జరిగింద`ని షారూక్ అన్నాడు. 

Bollywoodమరిన్ని...