మద్యం షాపులు మూసివేసిన రోజును డ్రై డే అని ఎందుకు అంటారో తెలుసా?.. దీని వెనుకనున్న కారణమిదే!

ABN , First Publish Date - 2022-02-12T14:52:22+05:30 IST

మీ ప్రాంతంలో లేదా నగరంలో మద్యం దుకాణాలను..

మద్యం షాపులు మూసివేసిన రోజును డ్రై డే అని ఎందుకు అంటారో తెలుసా?.. దీని వెనుకనున్న కారణమిదే!

మీ ప్రాంతంలో లేదా నగరంలో మద్యం దుకాణాలను ఏదో ఒక సందర్భంలో మూసివేసి ఉంటారు. ఆ రోజు మద్యం విక్రయాలు ఉండవని దాని అర్థం. మద్యం దుకాణాలు మూసివేసిన రోజును డ్రై డే అని అంటారు. ఆ రోజున ప్రభుత్వం కూడా డ్రై డే గా ప్రకటిస్తుంది. అయితే మద్యానికి బానిసలైన వారు డ్రై డే రోజున మందు కోసం ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటారు. ఇంతకీ మద్యం షాపులను మూసివేసిన రోజును డ్రై డే అని ఎందుకు అంటారో మీకు తెలుసా? దీనికి సంబంధింంచిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో వేర్వేరు డ్రై డే తేదీలు ఉంటాయి. చాలా రాష్ట్రాల్లో అక్టోబర్ 2, ఆగస్ట్ 15 జనవరి 26 తేదీలలో డ్రై డే అమలవుతుంది. ప్రతి రాష్ట్రంలో తన ప్రాంతానికి సంబంధించిన పండుగ రోజున లేదా ఒక నిర్దిష్ట రోజున మద్యం అమ్మకాలను నిషేధిస్తారు. 


చాలా రాష్ట్రాల్లో రవిదాస్ జయంతి రోజున మద్యం దుకాణాలు మూసివేస్తారు. అటువంటప్పుడు మిగిలిన రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరిచివుండవచ్చు. కాగా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి వేర్వేరు ఎక్సైజ్ విధానాలు ఉన్నాయి. దీని ప్రకారం డ్రై డే తేదీలను నిర్ణయిస్తారు. ఇదేవిధంగా ఏదైనా రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు, ఓటింగ్ ప్రాంతంలో కూడా మద్యం అమ్మకాలపై నిషేధం ఉంటుంది. కాగా డ్రై డే ప్రకటించడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. నిజానికి,  డ్రై డే అనేది జాతీయ పండుగలు, మతపరమైన పండుగలకు అమలు చేస్తారు. ఇది కాకుండా కొన్నిసార్లు శాంతిభద్రతల కారణంగా నగరం లేదా రాష్ట్రంలో డ్రై డే ప్రకటిస్తారు. నో ఆల్కహాల్ డేని డ్రై డే అని పిలవడానికి ఎటువంటి వాస్తవిక కారణం లేనప్పటికీ, డ్రై అనే పదాన్ని ఎవరైనా తాగని వ్యక్తి విషయంలో ఉపయోగిస్తుంటారు ఎవరైనా తగినంత నీరు, జ్యూస్ లేదా మరేదైనా పానీయం తాగనప్పుడు ఆ స్థితిని డ్రైగా పేర్కొంటారు. దీనిని మద్యం విషయంలో కూడా ఉపయోగిస్తుంటారు.  మద్యం తాగని వ్యక్తి డ్రై అయిపోయాడు అని ఇంగ్లీషులో చెబుతారు. అందుకే ఎవరూ మద్యం సేవించని రోజును డ్రై డేగా చెబుతున్నారు. అయితే ఇది అధికారికంగా నిర్థారణ కాదు. 1926లో దేశంలోని పంజాబ్‌లో డ్రై డే గురించి మొదటగా ఎక్సైజ్ చట్టంలో ప్రస్తావించారు. ఆ తర్వాత కేంద్రం 1950లో భారతదేశమంతటా దీనిని అమలు చేసిందని తెలుస్తోంది. అప్పటి నుంచి డ్రై డే అనే పదాన్ని ప్రభుత్వ పత్రాలలోనూ ఉపయోగిస్తున్నారు. 



Updated Date - 2022-02-12T14:52:22+05:30 IST