బోనాలకు వేళాయే

ABN , First Publish Date - 2022-06-30T04:03:56+05:30 IST

ఆషాడమాసంలో వచ్చే బోనాల ఉత్స వాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతాయి. సనాతన హైందవ సంప్రదాయంలో ఆషాఢంకు ప్రత్యేక ఉంది. హైందవ సంప్ర దాయంలో ఆచార వ్యవహారాలకు ప్రజలు పెద్ద పీట వేస్తారు. ఆషాఢ మాసాన

బోనాలకు వేళాయే
లోగో

- నేటి నుంచి ఆషాఢమాసం ప్రారంభం 

- నెల రోజుల పాటు గ్రామాలు, పట్టణాల్లో సంబరాలు 

- మొదలు కానున్న వనభోజనాలు

కోటపల్లి/నస్పూర్‌, జూన్‌ 29: ఆషాడమాసంలో వచ్చే బోనాల ఉత్స వాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతాయి. సనాతన హైందవ సంప్రదాయంలో ఆషాఢంకు ప్రత్యేక ఉంది. హైందవ సంప్ర దాయంలో ఆచార వ్యవహారాలకు ప్రజలు పెద్ద పీట వేస్తారు. ఆషాఢ మాసాన తొలకరి జల్లులతో నేలతల్లి పులకరించి అన్నదాతల లోగిళ్ళలో కోటి ఆశల కాంతులు నింపుతుంది. తొలకరి జల్లులతో ప్రకృతి పచ్చదనంతో శోభను సంత రించుకుంది. ఆషాడ మాసం శుభకార్యాలకు అనువైనా సమయం కాకపోయిన ఆధ్యాత్మికంగా ఎన్నో విశేషాలను కలిగి ఉంది.  గురువారం నుంచి ఆషాడ మాసం మొదలైవుతుంది. ఈ నెలలో ఊర్లన్నీ బోనమెత్తుకోనున్నాయి. వాడ, ఊరు కదలి రాగా డప్పు వాయి ద్యాలతో పోతురాజుల విన్యాసాలతో బోనాలు ఎత్తుకుని మహిళలు నడు స్తుండగా అమ్మవారికి మొక్కుల చెల్లింపుతో నెల రోజుల పాటు సంబ రాలు జరగనున్నాయి. సమస్త జీవరాశికి ఆధారమైన ప్రకృతిని పరాశక్తిగా ఆరాధించి వైపరీత్యాలు నిలువరించేలా అమ్మవారిని వేడుకోవడమే బోనాల ప్రత్యేకత.. 

- తొలి ఆదివారం నుంచి..

గురువారం ఆషాఢ మాసం ప్రారంభం కానుంది. ఈ మాసంలో తొలి ఆదివారం నుంచి బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. హైద్రాబా ద్‌లోని గోల్కొండ బోనాలు ఆషాఢ మాస ప్రారంభం నాడు బోనాలు ప్రారంభం కానుండగా అనం తరం తెలంగాణ అంతటా పట్టణాలు, గ్రామాల్లో గ్రామ దేవతలకు బోనాలు సమర్పించి ఉత్సవాలు ప్రారంభి స్తారు. ఇక గు రు, ఆదివారాల్లో గ్రామ దేవతలకు బోనాలు సమర్పిస్తారు. కొన్ని గ్రామాల్లో బొడ్రాయిని ప్రతిష్ఠించి దానికి పసుపు, కుం కుమలు రాసి పూజలు చేసి తమ ఇండ్లలో చేసిన వంటలను నివేదించి మొక్కులు తీర్చుకుంటారు. బొడ్రాయిని ప్రతిష్ఠించిన గ్రామాల్లో వేరే ఊరి వాళ్లను ఆ ఊరికి రానివ్వకపోగా సంబంధిత గ్రామ ప్రజలు ఊరి పొలుమేరలు దాటి వెళ్లరు. 

- బోనం నివేదన..

కొత్త కుండలో వండిన అన్నంలో పెరుగు, పాలు, బెల్లం కలిపి మహా ప్రసాదం తయారు చేస్తారు. ఈ కొత్త కుండను ఘటం అంటారు. ఈ ఘటం చుట్టూ వేపాకులు కట్టి, మూత పెట్టి, మూత మీద దీపం వెలి గించి ఘటాన్ని మహిళలు తలపై పెట్టుకుని డప్పు వాయిద్యాలు, మంగళ హారతుల మధ్య ఊరేగింపుగా గ్రామ దేవతల ఆలయాలకు చేరుకుని దేవా లయాల చుట్టూ ప్రదక్షణలు చేసి అమ్మవారికి బోనం నివేదించడం ఆనవాయితీ. అమ్మవారికి బోనం సమర్పించేటప్పుడు వేప మండలను పసుపు నీటిలో ముంచి సంప్రోక్షణ చేశాక అమ్మవారికి సమర్పిస్తారు.దీన్నే సాక పెట్టడం అంటారు. కొత్తగా పెళ్లి అయిన కూతుళ్లకు ఆషాడ పట్టి పెట్టి పుట్టింటికి తీసుకువచ్చినట్లుగా అమ్మవారిని అడపడుచుగా భావించి ఆషాఢ పట్టి మాదిరిగా పుట్టింటికి స్వాగతించి బోనాల సంబరం జరపడం సంప్రదాయం. ఇక గ్రామ దేవతలైన పోచమ్మ, లక్ష్మీదేవర, మాంతమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, అంకాలమ్మ, డొక్కాలమ్మ, పోలేరమ్మ, ఇలా రక రకాల పేర్లతో పిలిచే ఆది పరాశక్తిని కళశాలతో స్వాగతం పలికే కార్య క్రమాన్ని ఘటోత్సవం అంటారు. ఇక రక రకాల పిండి వంటలు, జంతు బలులతో అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. 

- పోతురాజుల విన్యాసాలు 

బోనాల సమర్పణ ఉత్సవాల్లో పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకుంటా యి. పోతురాజును అమ్మవారికి సోదరునిగా భావిస్తారు. ఒల్లంతా పసుపు పూసుకుని కాళ్లకు గజ్జెలు, నుదుట పెద్ద కుంకుమ బొట్టు, కళ్లకు కాటుక అలంకరించుకుని చేతిలో అలుగు తాడుతో పోతురాజుల చేసే విన్యాసాలు భక్తులను ఆకట్టుకుంటాయి. మరో వైపు చేతిలో వేప మండలు పట్టుకుని వెంట్రుకలు విరబూసుకుని చేసే శివసత్తుల విన్యాసాలు , రంగం మీదకు వచ్చి దేవతలను ఆవహించుకుని చెప్పే భవిష్యవాణిలు భక్తులను మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. 

- జిల్లాలో ప్రత్యేక జాతరలు 

ఆషాఢ మాసంలో నెల రోజుల పాటు బోనాల సంబరాలు జరగనుం డగా జిల్లాలోని పల్లెలు, పట్టణాల్లో ఆది, గురు వారాల్లో బోనాల సమర్పణ ఉత్సవాలు జోరుగా సాగనున్నాయి. జిల్లాలో ప్రధానంగా క్వారీ మహంకా ళి జాతర (మంచిర్యాల) బొక్కల గుట్ట మైసమ్మ బోనాల జాతర (రామ కృష్ణాపూర్‌), దుర్గాదేవి బోనాల జాతర (నస్పూర్‌) నిర్వహిస్తారు. ఆయా ప్రాంతాల్లో స్థానికంగా బోనాల పండగను నిర్వహిస్తారు. ఆషాఢ శుద్ధ పంచమి స్కంధ పంచమిగా చెబుతారు. సుబ్రమణ్యస్వామిని ఈ రోజు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆషాఢ షష్టిని కుమార షష్టిగా జరుపుతారు. శుక్ల పక్ష షష్టినాడు శ్రీసుబ్రహ్మణ్యస్వామి  వారిని పూజించి నీటిని మాత్రమే స్వీకరించి ఉపవాసం ఉండి మరుసటి రోజున స్వామిని దర్శిస్తే వ్యాధులన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అలాగే సింగరేణి కార్మిక కాలనీల్లో ఆషాఢం మొదలు కావడంతో వాడవాడలా సైడు పిల్లల జాతర ప్రారంభమవుతుంది. గనుల వద్ద కూడా కార్మికులందరూ కలిసి మైసమ్మకు చేసు కుంటారు. కాలనీలో కార్మిక కుటుంబాలు సామూహికం గా గ్రామదేవతకు ప్రత్యేక పూజలు చేసి చల్లంగ చూడమని వేడు కుంటారు. వన భోజనాలకు వెళుతూ సందడిగా గడుపుతారు. అంతే కాకుండా వీధులకు వెళ్ళి వచ్చే సమయాల్లో అంతా మంచి జరుగాలని కో రుతూ దారి మైసమ్మలకు కూడళ్ళ వద్ద ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. ఆషాఢంలో ఆదివారం కార్మిక కాలనీల్లో, రోడ్ల కూడళ్ళ వద్ద దారి మైసమ్మ కు పూజలు చేసి వాహన పూజలు చేస్తారు. 

Updated Date - 2022-06-30T04:03:56+05:30 IST