దుకాణాల వేలం ఎప్పుడు?

ABN , First Publish Date - 2022-01-24T04:28:27+05:30 IST

పట్టణంలో మూడు దశాబ్దాల క్రితం వెలసిన ఐడీఎస్‌ఎంటీ దుకాణాల రీ వేలం వాయిదాల పర్వంగా మారింది.

దుకాణాల వేలం ఎప్పుడు?
లీజ్‌ గడువు పూర్తి అయిన సీబ్లాక్‌ దుకాణాలు

గద్వాల టౌన్‌, జనవరి 23 : పట్టణంలో మూడు దశాబ్దాల క్రితం వెలసిన ఐడీఎస్‌ఎంటీ దుకాణాల రీ వేలం వాయిదాల పర్వంగా మారింది. మంచి వ్యాపార కూడలిలో ఉన్న ఈ దుకాణాల్లో ఏళ్ల తరబడి కొంత మంది మాత్రమే తిష్ట వేసుకుని వ్యాపారాలు చేస్తుండ టం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. లీజు గడువు ముగిసిన దుకాణాలకు తిరిగి వేలం నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా మునిసిపల్‌ పాలకులు చర్యలు తీసుకోకపోవడంతో ఆదాయానికి రూ.లక్షల్లో గండి పడుతున్నా పట్టించుకోక పోవడం ఆశ్చర్యం. పట్టణ పురపాలక మునిసిపాలిటీకి ప్రధాన ఆదాయ వనరుగా ఉండే దుకాణాల నెలసరి అద్దెను పెంచి ఆదాయాన్ని పెంచుకునే దిశగా కసరత్తు చేయాల్సిన యంత్రాంగం  ప్రేక్షక పాత్రకు పరిమితమైంది. ఇటీవల దుకాణాల వేలానికి రంగం సిద్ధమైనా నిబంధనలు, సాంకేతిక కార ణాల వల్ల రసాభాసగా మారి అర్ధాంతరంగా ఆగిపోగా, తిరిగి వేలం నిర్వహించేందుకు  నెలల తరబడి కాల యాపన జరుగుతుండటంపై పలువురు ఆశావాహులైన వ్యాపా రులు  అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

 40ఏళ్ల క్రితం దుకాణాల ఏర్పాటు 

1981లో అప్పటి కేంద్ర ప్రభుత్వం చిన్న, మధ్యతరహా పట్టణాల అభివృద్ధికి తోడ్పాటునందించే దిశగా ఆయా మునిసిపాలిటీలకు ఐడీఎస్‌ఎంటీ దుకా ణాల ద్వారా ఆదాయాన్ని రాబట్టుకునేందుకు నిధులు విడుదల చేసింది. ఆ క్రమంలో అప్పటి మునిసిపల్‌ చైర్మన్‌ డీకే  భరతసింహా రెడ్డి తేరు మైదానం చుట్టూ ప్రధాన రోడ్డు ముఖంగా రెండు బ్లాకులుగా 24దుకాణా ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అనంతరం మరికొన్ని నిధులతో పాత కూరగాలయ మార్కెట్‌ సమీపంలో మ రో 36దుకాణాల నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ దుకాణాలన్నీ 1986-87 ఆర్థిక సంవత్సరంలో అందుబా టులోకి రాగా, అప్పటి పాలకులు బహిరంగ వేలం  ని ర్వహించి మూడు సంవత్సరాల గడువుతో దుకాణాలను అద్దెకు ఇచ్చారు. గడువు ముగిసిన అనంతరం 20శా తం అద్దె పెంపుతో తిరిగి  టెండరు నిర్వహించడం లేదా ఉన్న వారికే అద్దె పొడిగింపు చేస్తూ వచ్చారు. వా టిలో కొంతమంది వేలంలో దుకాణాలు దక్కింకుని ఇత రులకు సబ్‌ లీజుకు ఇవ్వగా, మరికొందరు అనధి కారంగా కొంత గుడ్‌విల్‌తో మునిసిపల్‌ రికార్డుల్లో పేర్లు మార్పించారు. ఇదంతా మునిసిపల్‌ పాలకులు కనుస న్నల్లోనే జరిగిన తతంగం కావడం గమనార్హం. 

 పెరుగుతున్న అద్దెలు 

పాత ఐడీఎస్‌ఎంటీ దుకాణాలను ఆనుకు ని కొత్తగా వెలసిన దుకాణాలకు నెలసరి అద్దెలు వేలల్లో ఉండగా,  పాత వాటికి మాత్రం నామమాత్రంగా అద్దెలు కొన సాగుతుండటం ఇప్పుడు చర్చనీ యాంశంగా మారింది.  తమ సమీ పంలోని దుకాణాల వారు రూ.1000ల నుంచి మొదలుకుని రూ.5000లోగానే అద్దె చెల్లిస్తుండగా, వాటికి అత్యంత స మీపంలో ఉన్నవారు మాత్రం  రూ.25,000ల నుంచి రూ.32,000ల వర కు అద్దె చెల్లిస్తున్నారు. ఇప్పటికీ ఇలాంటి దుకాణాలు దాదాపు 60వరకు ఉండగా, వీటి ద్వారా ప్రతి నెలా రూ.లక్షల్లో ఆదాయానికి గండి పడుతున్నట్లు అధికారులకు స్పష్టంగా తెలుస్తూనే ఉన్నా, గడువు ముగిసిన దుకాణాలకు తిరిగి వేలం నిర్వహించేందుకు మాత్రం మీనమేషాలు లెక్కిస్తు న్నారు. కౌన్సిల్‌ సమావేశాల్లో ఈ విషయాలపై చర్చ వచ్చినప్పుడల్లా పార్టీలకు అతీతంగా సభ్యులందరూ దు కాణాలకు రీ టెండర్‌ నిర్వహించి ఆదాయాం పెంచాల ని కోరుతుండటం గమనార్హం. అందరూ ఇందుకు సముఖంగానే ఉన్నా టెండర్లు ఎందుకు నిర్వహించడం లేదన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. 

 రసాభాసగా వేలం

ఏళ్ల తరబడి కొనసాగుతున్న దుకాణాల్లో కొన్నింటికి తిరిగి టెండరు నిర్వహించేదుకు గత జూన్‌లో అప్పటి కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి, మేనేజర్‌ మల్లారెడ్డి ప్రయత్నిం చగా, వారు నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు పిలి చారంటూ అన్నిపార్టీల కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. టెండరు నిర్వహించకుండా అడ్డుకునే ప్రయ త్నం చేయగా, అధికారులు పోలీసులను మునిసిపల్‌ కార్యాలయానికి పిలిపించడంతో వ్యవహారమంతా రసాభాసగా మారింది. విషయం తెలసుకుని అక్కడి వ చ్చిన మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌, టెండరుదారుల వద్ద నుంచి డిపాజిట్‌ సొమ్మును బ్యాంక్‌ డిడి రూపం లో కాకుండా నేరుగా నగదు స్వీకరించడాన్ని తప్పు ప ట్టారు. ఆ విషయం తనకు కూడా చెప్పకుండా ఎందు కు చేశారంటూ అధికారులను మందలించి నిబంధనల మేరకు  టెండరు నిర్వహించాలని స్పష్టం చేశారు. దీంతో టెండర్లు వాయిదా వేసిన అధికారులు తిరిగి మునిసిపల్‌ కౌన్సిల్‌ అనుమతితో త్వరలోనే పట్టణంలో గడువు ముగిసిన అన్ని ఐడీఎస్‌ఎంటీ దుకాణాలకు రీ టెండర్‌ నిర్వహిస్తామని చెప్పారు. ఆ ప్రక్రియ ఇప్పటి వరకు కార్యరూపం దాల్చక పోవడం సర్వత్రా చర్చనీ యాంశంగా మారింది. కొత్తవ్యాపారులకు అవకాశం క ల్పించేలా రీ టెండర్లు పిలవాలని, అదే సమయంలో ముని సిపల్‌ ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న దుకాణాల అద్దె ను పెంచుకోవాలని పట్టణ ప్రముఖులు కోరుతు న్నారు. 

 త్వరలోనే రీ టెండర్లు నిర్వహిస్తాం 

లీజు గడువు ముగిసిన వి, టెండర్లలో దుకాణాలు దక్కించుకున్నా సకాలంలో డిపాజిట్‌ సొమ్ము చెల్లించ కుండా నిలిచి పోయిన దు కాణాలు అన్నింటి కీ టెం డర్లు నిర్వహించేందుకు ఇప్పటికే కౌన్సిల్‌ సమా వేశంలో ఏకగ్రీవంగా తీర్మా ణించాం. కరోనా లాక్‌ డౌన్‌ కారణాల వల్ల వేలం ప్ర క్రియ వాయిదా పడుతూ వచ్చింది. త్వరలోనే టెం డర్లు ఖరారు చేసి మునిసిపాలిటీకీ ఆదాయాన్ని పెంచుకునే దిశ గా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం. 

- బీఎస్‌ కేశవ్‌, మునిసిపల్‌ చైర్మన్‌

Updated Date - 2022-01-24T04:28:27+05:30 IST